- హ్యాకింగ్ కు గురైన టీడీపీ యూట్యూబ్ ఛానల్
- పునరుద్దరణకు రంగంలోకి దిగిన టెక్నికల్ సిబ్బంది
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి తాను పితామహుడ్నని, భారతదేశానికి తాను ఐటీని పరిచయం చేశానని ఎప్పుడూ చెపుతూ ఉంటారు. సెల్ ఫోన్లను తానే కనిపెట్టానంటారు… టెక్నాలజీ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే టెక్నాలజీ అంటారు కానీ పార్టీ తరపున నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ ని మాత్రం హ్యాకింగ్ కి గురి కాకుండా కాపాడుకోలేకపోయారు. హ్యాకర్లు టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేశారు. బుధవారం ఉదయం నుంచి యూట్యూబ్ లో ఉన్న టీడీపీ ఛానల్ ప్రసారాలు ఆగిపోయాయి. చానల్లో ఏదైనా వీడియో ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నించిన వారికి స్ట్రక్ అయినట్లు చూపిస్తోంది. యూట్యూబ్ నామ్స్ అండ్ సర్వీస్లు ఉల్లంఘించినందుకు వీడియోలను తొలగించినట్లు చూపిస్తోంది. దీంతో ఖంగుతిన్న టీడీపీ టెక్నికల్ వింగ్ ఛానల్ ని పునరుద్దరించడానిక ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో హ్యాకర్లను గుర్తించే ప్రయత్నం చేస్తూనే యూట్యూబ్ యాజమాన్యానికి పార్టీ వర్గాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న, ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద ఐటీడీపీ కార్యకర్తలు సైబర్ దాడులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాపులర్ వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానళ్ళు ఏవైనా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వెంటనే ఐటీడీపీ మిడతల దండులా ఆయా సైట్లపై పడిపోయి క్రాష్ అయ్యేలా చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు టీడీపీ అదికారిక వెబ్ సైటే హ్యాక్ అయ్యిందని తెలిసి ఐటీడీపీ బాధిత సోషల్ మీడియా యాక్టివిస్టులు సంబరపడిపోతున్నారు.