32.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

గ్రోక్‌పై కేంద్రం ఫోకస్

గ్రోక్.. ఇప్పుడు యమ ట్రెండింగ్. మాటకు మాట అన్నట్టుగా సమాధానాలు చెబుతూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎక్స్‌లో ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టిన గ్రోక్ ఏఐ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్స్‌లో అడుగుతున్న ప్రశ్నలు.. వాటికి అది చెబుతున్న సమాధానాలు చెబుతున్న తీరు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. మాటకు మాట అన్నట్టుగా ఉంటున్నాయి గ్రోక్ సమాధానాలు. గీవ్ రెస్పెక్ట్.. టేక్ రెస్పెక్ట్ అన్నట్లుగా నడుస్తోంది గ్రోక్‌ ఏఐ. ఏమైనా మాట తులామా.. సమాధానం అదే తీరులో ఉంటుంది. ఇప్పుడిదే కేంద్రాన్ని కాస్త కలవర పెడుతోంది.

ఈ విషయంపై ఇప్పుడు కేంద్ర ఐటీశాఖ ఫోకస్ చేసింది. హిందీలో కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు అసభ్య పదజాలంతో సమాధానం ఇచ్చింది గ్రోక్. దీంతో ఏఐ ఇలాంటి భాషను ఎందుకు మాట్లాడుతోందనే దానిపై ఫోకస్ చేసింది కేంద్రం. అంతేకాదు దీనిపై ఎక్స్ నుంచి క్లారిటీ ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

గ్రోక్ సమాధానాల్లో ఎలాంటి ఫిల్టర్‌లు లేకపోవడం ఇప్పుడు ఈ వివాదానికి తెరలేపినట్టు అర్థమవుతుంది. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో ఓ డిబెట్ కూడా నడుస్తోంది. మరి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. దానికి ఎక్స్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

నిజానికి గ్రోక్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌గా వాడుతోంది యువత. వాళ్లు వాడిన బూతు మాటల్ని.. తిరిగి వాళ్ల మీదే ప్రయోగిస్తూ బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది గ్రోక్ ఏఐ. తెలుగులో కూడా ఇదే స్థాయిలో ఉంది గ్రోక్ రచ్చ. అది ఇచ్చే ఆన్సర్లు చూసి తెలుగు నెటిజన్లంతా షాక్ అయుపోతున్నారు. ఇంకా క్రేజీగా ప్రశ్నలు అడుగుతున్నారు. వాడుతున్న భాష, పదాలు ఆకట్టుకుంటున్నాయి. ఓ చాట్ బాట్‌లా కాకుండా ఓ వ్యక్తిలా ఫ్రెండ్లీగా సమాధానాలు ఇస్తుంది గ్రోక్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com