చెప్పినట్టుగానే అమెరికా విద్యాశాఖను మూసేశారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు ఆయన. ఈ శాఖను తొలగించాలని ఆయన మొదటి సారి అధ్యక్షుడైనప్పుడే ప్రయత్నించారు. కానీ అప్పుడు అమెరికా కాంగ్రెస్ సహకరించకపోవడంతో వెనక్కి తగ్గారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో విద్యాశాఖను తొలగిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పినట్టుగానే దానిని రద్దు చేసేశారు.
అమెరికాలో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ 1979 నుంచి అమల్లో ఉంది. అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్డర్ అమెరికా విద్యా విధానాన్ని పర్యవేక్షించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. స్కూల్స్‌కు ఆర్థిక సాయం చేయడం.. సమస్యలను గుర్తించి పరిష్కరించడం లాంటి బాధ్యతలు నిర్వహిస్తోంది ఈ డిపార్ట్‌మెంట్. మొత్తం కోటి 30 లక్షల మందికి పైగా విద్యార్థులకు బిలియన్ డాలర్ల కొద్ది గ్రాంట్లు ఇస్తోంది ఈ డిపార్ట్‌మెంట్.
ట్రంప్ అయితే ఆదేశాలు జారీ చేశాడు కానీ.. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఈ నిర్ణయం అమలు కాదు. అయితే ప్రస్తుతం ట్రంప్‌కు కాంగ్రెస్‌లో పూర్తి స్థాయిలో బలం లేదు. మరి తరువాత ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
40 ఏళ్లుగా విద్యాశాఖను నిర్వహిస్తూ.. బిలియన్ డాలర్ల కొద్ది నిధులు ఖర్చు చేస్తున్నా ఎలాంటి మార్పులు కనిపించడం లేదన్నారు. ప్రతి ఏడాది అమెరికన్ ప్రభుత్వం 251 బిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తోంది అమెరికా ప్రభుత్వం. ఈ డిపార్ట్‌మెంట్‌లో 4,200 మంది పనిచేస్తున్నారు.