1. ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీ.
2. ఎలక్ట్రికల్ బస్సుల రూపంలో ప్రైవేట్ సంస్థలకు డిపోలో అప్పగింత.
3. డ్రైవర్ కూడా ప్రైవేట్ సంస్థకు చెందినవాడే.
4. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు.
5. ప్రశ్నార్థకంగా మారుతున్న లక్షలాది మంది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు.
తెలంగాణలో ఆర్టీసీ పూర్తిగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది… వెంటనే కాకపోయినా దశలవారీగా ఆర్టీసీ పూర్తిగా ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది.. ఆర్టీసీ అధికారికంగా, సాంకేతికంగా ప్రైవేటీకరణ కాదని చెప్పినా… ఇకనుంచి బస్సులు నడిపేది మాత్రం ప్రైవేట్ సంస్థకు సంబంధించిన డ్రైవర్ మాత్రమే. అదేవిధంగా రెగ్యులర్ ఆర్టీసీ డిపోలకు కాకుండా ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన డిపోలకు బస్సులు వెళ్లానున్నాయి… ఈ నిర్ణయం ప్రస్తుతం వివాదంగా మారింది. ఎలక్ట్రికల్ బస్సుల రూపంలో ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ఆర్టీసీలోకి ప్రవేశించాయి.. ఎలక్ట్రికల్ బస్సులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ మనుగడకు ప్రమాదకరంగా మారుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం 500 ఎలక్ట్రిక్ బస్సు లను అద్దెకు తీసుకుంది .. నిజానికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను కొనాలని మొదట భావించినప్పటికీ ఇది ఆర్థికంగా భారం అవుతుందని గుర్తించి అద్దె రూపకంగా తీసుకున్నారు… ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది.. ఈ అద్దె బస్సు కు డ్రైవర్, క్లీనర్ ప్రైవేట్ సంస్థకు సంబంధించిన వాళ్లే ఉంటారు.. ఆర్టీసీ నుంచి కేవలం కండక్టర్ మాత్రమే ఉంటారు… దీంతో లక్షలాది మంది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీనిని ప్రారంభించారు. ఇప్పటికే వరంగల్, హైదరాబాద్ డిపోల్లో దీనికి శ్రీకారం చుట్టారు.
త్వరలో కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ సహా పలు డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు… ఎలక్ట్రికల్ బస్సుల మెయింటెనెన్స్ ఢిల్లీకి సంబంధించిన ఒక సంస్థ చూసుకుంటుంది.. రెగ్యులర్ గా ఉండే డిపోల్లో ఈ మెయింటెనెన్స్ సాధ్యం కాదన్నది అధికారుల వాదన.. దీంతో ఇప్పుడు డిపోలో ఉంటున్న సిబ్బందిని ఇతర డిపోలకు బదిలీ చేసే పనిలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్నరోజుల్లో కొత్తగా ఆర్టీసీలో ఎలాంటి నియామకాలు జరిగే అవకాశం కల్పించడం లేదు. 7వేలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని ఇప్పట్లో భర్తీ చేయలేమని అధికారులు అంటున్నారు.. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బి ఆర్ఎస్ ఈ నిర్ణయాన్ని తప్పుపడుతుంది.. ప్రభుత్వం కుట్రపూరితంగా దశలవారీగా పూర్తిగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించింది… అయితే చాలా రాష్ట్రాల్లో ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో ఇలాంటి విధానాలే ఉన్నాయని … ఇది ప్రైవేటీకరణ కాదని ప్రభుత్వం వాదిస్తుంది.
ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకువెళ్తోందని, ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు…
కలిసి వచ్చే సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని పువ్వాడ అజెయ్ ప్రకటించారు.