27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు!

జమ్మూ కాశ్మీర్‌ పహల్గాంలోని బైసరన్‌ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. లష్కర్‌–ఎ–తొయిబాతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) బాధ్యత వహించిన ఈ దాడిలో 26 మంది చనిపోయారు. వారిలో 25 మంది భారతీయులు, ఒక నేపాళీ పౌరుడు ఉన్నారు. ఉగ్రవాదులు కార్బైన్‌లు, ఏకే–47 రైఫిళ్లతో పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత, కేంద్ర ప్రభుత్వం భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఉగ్రవాదులను అంతమొందించేందుకు ముష్కరుల అన్వేషణ తీవ్రతరం చేసింది. పహల్గాం దాడి తర్వాత, భారత సైన్యం, స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ సంయుక్తంగా పూంఛ్, బారాముల్లా, పహల్గాం అడవుల్లో ఉగ్రవాదుల కోసం భారీ ఏరివేత ప్రారంభించాయి. హెలికాప్టర్‌లు, డ్రోన్‌లతో ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో అత్యాధునిక సాంకేతికత ఉపయోగిస్తున్నారు. ఇందులో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన నెట్రా డ్రోన్‌లు 240 డిగ్రీల కవరేజ్‌తో రియల్‌–టైమ్‌ డేటాను అందిస్తాయి. ఇజ్రాయెల్‌ నుంచి దిగుమతి చేసుకున్న EL/W–2090 రాడార్‌ సిస్టమ్స్‌ 450 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను గుర్తిస్తాయి. ఇస్రో ఉపగ్రహాల నుంచి పొందిన రియల్‌–టైమ్‌ ఇమేజరీ ఉగ్రవాదుల స్థానాలను ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడుతోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com