- అన్ని రాష్ట్రాల సీఎం లకు అమిత్ షా ఆదేశం
- రాష్ట్రాల వారీగా సీఎం లతో నేరుగా మాట్లాడిన హోం మంత్రి
- 27 కల్లా పాకిస్థానీ జాతీయులందరూ వెళ్లిపోవాలి
- ఒక్కరు కూడా మిగల్డానికి వీల్లేదు
- సీఎంలంతా ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలన్న షా
- కొనసాగుతున్న నిరసనలు, ఆందోళనలు
- పెహల్గాం దాడి బాధితులకు రాహుల్ పరామర్శ
భారతదేశం నలుచెరుగులా పాకిస్తానీయులను వలవేసి పట్టుకునే పనిలో కేంద్రప్రభుత్వం నిమగ్నమైంది. పెహల్గాం ఉగ్రదాడి తదనంతరం మన దేశంలో ఉంటున్న పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతటితో ఊరుకోకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులను వెతికి పట్టుకుని వారి వీసాలను రద్దు చేసి వాళ్ల దేశం పంపేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. మీమీ రాష్ట్రాల్లో పాకిస్తాన్ పౌరులు ఎంత మంది ఉన్నారో గుర్తించి వారిని వెంటనే స్వదేశానికి పంపడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో అమిత్ షా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఈ ప్రక్రియను వీలైంనత త్వరగా ముగించాలని అమిత్ షా ముఖ్యమంత్రులను కోరారు. హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ దాదాపు 200 మంది పాకిస్తానీయులకు ఉన్నట్లు గుర్తించారు. వీరందరి వీసాలు రద్దు చేసి తక్షణం పాకీస్తాన్ పంపేయాలని అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత మంగళవారం కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహెల్గామ్ లో ఉగ్రవాదులు తెగబడి జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిపై మండిపడ్డ కేంద్రప్రభుత్వం ఈ ఉగ్రదాడికి మూలాలు పాకిస్తాన్ లో నే ఉన్నాయని నిగ్గు తేల్చింది. అంతే కాంకుడా ఉగ్రవాదులను ప్రోత్సహించి భారత్ పై దాడులు చేయిస్తున్నందుకు గానూ ఆ దేశంపై అనేక అంక్షలు విధించి దౌత్య పరమైన సంబంధాలను కూడా తగ్గించేసింది. అందులో భాగంగానే భారత్ లో ఉన్న పాకిస్తాన్ పౌరుల వీసాలను తక్షణం రద్దు చేసింది. పెహల్గాం దాడి నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ఇంకా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
పెహల్గాం దాడి తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని రాజ్ భవన్ లో సిమ్లా ఒప్పందం సంతకం జరిగిన టేబుల్ పై పాకిస్థానీ జెండాను భారత్ తొలగించింది.