28.3 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్‌ సెల్స్‌పై  డేగ కన్ను

ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత టెర్రర్‌ స్లీపర్‌ సెల్స్‌ యాక్టీవ్‌ కాబోతున్నాయా? నిఘా వర్గాల హెచ్చరికలతో స్లీపర్‌ సెల్స్‌పై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా తెలుగు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. పహల్గామ్‌లో దాడుల వెనుక లోకల్‌ స్లీపర్‌సెల్స్‌ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్లీపర్‌ సెల్స్‌ హెల్ప్‌ లేకుండా ఇలాంటి దాడి చేయడం అసాధ్యమని భద్రతా వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఉగ్రవాదులు.. వారికి సహకరించినవారి ఇళ్లపై భారత ఆర్మీ ఇప్పటికే ఉక్కుపాదం మోపింది.

దేశంలో ఎక్కడ ఉగ్ర కుట్రలు బయటపడ్డా వాటికి సంబంధించిన లింకులు హైదరాబాద్‌లోని స్లీపర్‌ సెల్స్‌కు కనెక్ట్‌ అయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకవైపు మిస్‌ వరల్డ్‌ పోటీలు.. మరోవైపు వార్‌ ఇండికేషన్స్‌తో హైదరాబాద్‌పై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆపరేషన్ సింధూర్, అనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సమీక్ష చేశారు. తెలంగాణలో భద్రత కట్టుదిట్టం చెయ్యాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా.. ఎయిర్‌పోర్ట్‌లు, విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రత పెంచాలన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా నిఘా వ్యవస్థ పటిష్టానికి ఆదేశించారు. కేంద్ర రక్షణ రంగ సంస్థల దగ్గర మరింత భద్రత పెంచాలన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన టూరిస్టులకు తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిఘా వ్యవస్థ పనితీరును సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ పరిధితో పాటు తీర ప్రాంతాల్లో రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రత, తీరప్రాంత రక్షణపైనా చర్చించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కునేలా అన్ని స్థాయిల్లోనూ అధికారులు, సంస్థలు సిద్ధంగా ఉండాలన్నారు.

ప్రభుత్వాల సన్నద్ధతపై కేంద్రం చేసిన సూచనలను పూర్తిగా అమలు చేయాలని.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టాలని మెరైన్ పోలీసులను ఆదేశించారు. నౌకాదళం, కోస్ట్‌గార్డు ఇతర రక్షణ దళాలతో సమాచారం పంచుకోవాలన్నారు. తిరుమల లాంటి ప్రదేశాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.మొత్తంగా.. భారత్-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ అలెర్ట్‌ అయ్యాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com