ఫడ్నవిస్ సీయం కావలంటున్న బీజేపీ శ్రేణులు
మా నాన్నే సీయం అంటున్న షిండే తనయుడు శ్రీకాంత్
అజిత్ పవర్ సీయం అంటున్న ఆయన శ్రీమతి సునేత్ర
మహాయతి కూటమి అఖండ విజయంతో మహారాష్ట్ర పీఠాన్నికైవశం చేసుకోవడంతో కూటమిలోని మూడు పార్టీల కార్యకర్తలు ఆనందోత్సాహాలలో మునిగితేలుతున్నారు. మహా వికాస్ అఘాడీలో ఉన్న మూడు పార్టీలకు కనీసం ప్రతిపక్ష హోదా దక్కేఅన్ని అసెంబ్లీ స్ధానాలు కూడా దక్కే పరిస్ధితి కనిపించడం లేదు. ఫలితాలు వన్ సైడ్ కావడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో మూడు రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆలోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అయితే కూటమి విజయం కావడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కబోతుందనే ఉత్కంఠ ఏర్పడింది. కూటమిలో ఉన్న మూడు పార్టీల ముఖ్య నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉండటంతో మహరాష్ట్ర రాజకీయాల్లో ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏక్ నాథ్ షిండేనే సీయంగా కొనసాగిస్తారా లేక అత్యధి సీట్లు సాధించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ని సీయంగా చేస్తారా అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు అజిత్ పవర్ కూడా సీయం రేసులో బలంగా నిలబడుతున్నారు.
మహరాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావల్సిన సంఖ్యాబలం 145. బీజేపీ సింగిల్ గానే 130 పైచిలుకు సాధించే అవకాశం కనిపిస్తోంది. ఫలితాల సరళి చూసి మహరాష్ట్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఫడ్నవిస్ ను ఎట్టి పరిస్ధితుల్లో సీయంను చేయాల్సిందే అని ఇప్పటికే గళమెత్తారు. ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పనిచేసి కూడా అధిష్టానం ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించి పార్టీ పట్ల తన విశ్వసనీయతను నిరూపించుకున్నారని అందువల్ల ఫడ్నవిస్ ను తప్పితే వేరే వాళ్ళను ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తే ఊరుకునేది లేదని బీజేపీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులు కూడా ఫడ్నవీస్ కు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు యాభై శాతం ఓట్లు సాధించిన బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అవ్వడం తల్లీబిడ్డా న్యాయం అంటున్నాయి బీజేపీ వర్గాలు.
మరోపక్క షండే మీడియోతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మహరాష్ట్రాలో రాజకీయ వేడి పుట్టించాయి. కూటమిలో ఎక్కువ మంది శాసనసభ్యులు గెలిచిన పార్టీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎంపిక చేయాలనే రూల్ ఏమీ లేదు కదా అని బాంబు పేల్చారు. కూటమిగా పోటీ చేసినప్పుడు సీయం పదవికీ సీట్ల శాతానికి సంబంధం లేదని షిండే చేసిన వ్యాఖ్యలు మహాయుతిలో కాక పుట్టిస్తున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలు సమావేశమై మాట్లాడుకుని సీయంని నిర్ణయిస్తామని మీడియాకు తెలిపారు షిండే. ఇంకోవైపు షండే తనయుడు శ్రీకాంత్ షిండే మీడియాతో మాట్లాడుతూ గెలుపులో సింహభాగం శివసేనదే అని… తన తండ్రే సియం కావాలని వ్యాఖ్యానించారు.
ఇక ఎన్సీపీ(అజిత్) కార్యకర్తలు తమ నాయకుడికే సీయం పీఠం దక్కాలని అజిత్ పవర్ అంటున్నారు. అజిత్ పవార్ ని సీయంగా చూడాలని బారామతి ప్రజలు అనుకుంటున్నారని ఆయన సతీమణి సునేత్రా పవార్ గళం విప్పారు. గతం చూస్తే… క్రితం సారి కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. కానీ అప్పటి భాగస్వామ్య పక్షమైన ఉద్దవ్ ధాకరే నేతృత్వంలోని శివసేన బీజేపీని కాలతన్ని కాంగ్రెస్ తో ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆతరువాతి కాలంలో ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో పలువురు శాసనసభ్యులు పార్టీని చీల్చి బీజేపీ, ఎన్సీపీ(అజిత్) పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయిత ఈసారి బీజేపీకి దాదాపు 130 పైచిలుకు స్ధానాల్లో విజయావకాశాలు ఉన్నందున అటువంటి ప్రమాదం తప్పింది. అయితే సీయం ఎంపిక విషయంలో పీఠముడి పడే అవకాశం ఉందని మహాయతి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.