28.7 C
Hyderabad
Thursday, August 6, 2026

Live Video

spot_img

అమరావతిలో అభివృద్ధి పనులకు టెండర్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో  రూ.2816 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఏపిసీఅర్డిఏ టెండర్లు పిలిచింది. రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు టెండర్లు కాల్ చేశారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రారంభించినా ఆ తర్వాత నిలిచిన పనులను పూర్తి చేసేందుకు బిడ్ల దాఖలుకు పిలిచారు. బిడ్ల దాఖలుకు ఈ నెల 31న సాయంత్రం 4 గంటల వరకు గడువు కాగా అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్న సీఆర్డిఏ.

పాలవాగు, గ్రావిటీ కాలువల పనులతో పాటు రాజధాని నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లకు సంబంధించిన పనులకు టెండర్ లు ఆహ్వానించారు.

అనంతవరం నుంచి ఉండవల్లి వరకు కొండవీటి వాగును, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు పాలవాగు వెడల్పు, లోతు చేసే పని కోసం శాఖమూరులో రూ. 462.26 కోట్లతో 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం.

రూ.303.73 కోట్లతో 7.83 కి.మీ. పొడవు కాలువ నిర్మాణం, 0.1 టీఎంసీ సామర్థ్యంతో కృష్ణాయపాలెం రిజర్వాయర్ పనులు చేపట్టనున్నారు. వివిధ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, వాననీటి మళ్లింపు కాలువలు, తాగునీటి సరఫరా పైపులైన్లు, డ్రెయినేజీలు, పచ్చదనం అభివృద్ధి, పాదచారులు- సైకిల్ ట్రాక్లు, విద్యుత్, కమ్యూనికేషన్ తీగలను అమర్చేందుకు డక్ట్ నిర్మాణం కోసం టెండర్ లు పిలిచిన సీఆర్డిఏ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com