తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు గడుస్తున్నా హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల చిహ్నంపై నామకరణం లేదని అమరవీరుల చిహ్నం నామకరణ సాధన సమితి ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యమంలో పాల్గొన్న నేతలు ఉన్నత స్థానాల్లో ఉన్నా సరిదిద్దలేక పోయారని, సిఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని సరిదిద్దాలని కమిటీ సబ్యులు కోరారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ రోజు సాధన సమితి సభ్యులు పిజే సూరి, ఏ శాం మోహన్, గొనె ప్రకాష్ రావు, లక్ష్మి నారాయణ్ గౌడ్, సిద్దులు, యాదగిరి రావు, వినయ్ కుమార్ ముదిరాజ్ కలిశారు.
ఈ సందర్భంగా గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల చిహ్నంపై నామకరణం లేకపోవటం గురించి వివరించారు. దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
గన్ పార్క్ చిహ్నం శిల్పి ఎక్కా యాదగిరిని గుర్తించి 300 గజాల స్థలం, ఒక కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటింఛినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే రీతిలో గన్ పార్క్ స్ణూపంపై నామకరణ ఫలకం ఏర్పాటు చేసి, నాటి(1969 నుండి1971వరకు) నేటి(ఆత్మహత్య చేసుకున్నవారిని గుర్తించి) అమరవీరులను గుర్తించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో వారి కుటుంబాలకు ఆర్థిక, ఉద్యోగ, నివాస సదుపాయాలు కల్పిస్పారని.. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.