బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో షాక్ తగిలింది. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ జర్మన్ పౌరుడేనని నిర్ధారించిన తెలంగాణ హైకోర్టు… ఆయనకు 30 లక్షల జరిమాన విధించింది.
రూ. 25 లక్షలు ప్రత్యర్థికి చెల్లించాలని, మరో రూ. 5 లక్షలు హైకోర్టు న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలన్న హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చెన్నమనేని రమేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చెన్నమనేని రమేష్ తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ కోర్టులను, ప్రజలను మోసం చేస్తున్నారని పిటిషనర్ .. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపున లాయర్ రవి కిరణ్‌రావు వాదనలు వినిపించారు. చిన్నమనేని పౌరసత్వం రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇప్పటికీ చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని…. చెన్నమనేని జర్మనీలో రిటైర్డ్ ప్రొఫెసర్‌గా చెప్పుకుంటూ ఇండియాలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భారతీయ పౌరుడు కాకుండానే ఎన్నికల్లో పోటీ చేశారని వాదించారు.