పుష్ప-2 చిత్రం టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతోపాటు అర్థరాత్రి 1 గంట షోకు అనుమతి ఇవ్వగా…పుష్ప2 బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు ఝామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200 పెంపు, డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతించారు. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 పెంపునకు అనుమతి