31.8 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణలో వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో వచ్చే విద్యాసంవత్సరం (2025-26) ప్రవేశాలకి నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈరోజు(బుధవారం) ప్రకటన విడుదల చేసింది. టీజీ ఈఏపీసెట్‌ (TG EAPCET 2025), తెలంగాణ ఐసెట్ (TG ICET 2025), టీజీ ఎడ్‌సెట్‌ (TG EdCET 2025) తదితర 7 ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించింది.

ఏప్రిల్‌ నెలాఖరు నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవతున్నాయి. ఏప్రిల్‌ నెలలో టీజీ ఈఏపీసెట్‌ 2025 (Telangana EAPCET 2025) తో ప్రారంభమై మే నెలాఖరు వరకు అన్ని పూర్తి అవుతాయి. TS EAMCET ఇప్పుడు 2024- 25 విద్యా సంవత్సరం నుంచి TG EAPCET (తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)గా మార్చారు.

ఇప్పటి వరకు నీట్‌ 2025 నిర్వహణ తేదీని ఎన్‌టీఏ (NTA) ప్రకటించలేదు. నీట్‌ 2025 పరీక్ష (NEET 2025) తేదీలను బట్టి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉన్న‌త విద్యలో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే సెట్ల‌కు క‌న్వీన‌ర్ల‌ను ఉన్న‌త విద్యామండ‌లి ఇటీవల నియ‌మించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com