28.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

టీమ్ ఇండియా – బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌

ఛాంపియన్స్‌ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది టీమ్ ఇండియా. బంగ్లాదేశ్‌తో దుబాయ్ వేదికగా ఢీకొట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చిన ప్లేయర్స్.. బంగ్లాను మట్టికరిపించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం భారత్, పాక్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు బంగ్లాను ఓడిస్తే మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. దీనికి తోడు ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్‌ గెలుపు ముఖ్యమే కాబట్టి.. ఎలాగైనా గెలిచి తీరాలని డిసైడైంది టీమ్ ఇండియా.

లీగ్‌లో ఆడాల్సింది మూడు మ్యాచ్‌లే అయినా.. ప్రతి మ్యాచ్‌ గెలవాల్సిందే. అందుకే బంగ్లాదేశ్‌ను ఏమాత్రం కూడా లైట్‌గా తీసుకునే అవకాశం లేదు. ఇక అందరి కళ్లు రోహిత్, విరాట్‌పైనే ఉన్నాయి. ఇంగ్లండ్‌ వన్డేల్లో ఇద్దరు పర్వాలేదనిపించారు. మరి మరోసారి తమ జూలును విదిలిస్తారా? లేదా? చూడాలి. ఇక గిల్, అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వారు కూడా తమ జోరును కొనసాగిస్తారా? లేదా? చూడాలి. ప్రస్తుతం టీమ్ ఇండియాకు ఐదుగురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్.. మరి వీరిలో ఎవరికి టీమ్‌లో చోటు దక్కుతుందో చూడాలి. ఇక షమీ ఓపెనింగ్ స్పెల్ ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరమే. ఇక హర్షిత్ రాణా ఫైనల్‌ టీమ్‌లో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

బంగ్లాదేశ్‌ టీమ్‌ కూడా గట్టిగానే కనిపిస్తోంది. మిరాజ్, మహ్మదుల్లా, హుసేన్, సౌమ్య సర్కార్ తమ ఆల్‌రౌండర్ పర్ఫామెన్స్‌తో రాణిస్తున్నారు. ఇక యువ బ్యాట్స్‌మెన్ తంజిత్, తౌహిద్‌ కూడా మంచి జోరుమీదే ఉన్నారు. ఇక ముస్తాఫిజుర్ బౌలింగ్‌పై బంగ్లాదేశ్‌ బాగా ఆధారపడింది.

అయితే బంగ్లాపై భారత్‌కు మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇరు జట్లు 32 సార్లు తలపడితే.. భారత్‌ ఓడింది కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే. ఒకటి డ్రాగా ముగిసింది.

కోహ్లీ కొత్త రికార్డు సృష్టిస్తాడా?
కోహ్లీ అంటేనే రికార్డుల రారాజు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికగా మరో రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ గేల్ పేరుపై ఉంది. 17 మ్యాచుల్లో 791 పరుగులు చేశాడు గేల్. అయితే విరాట్ 13 మ్యాచుల్లో 529 పరుగులు చేశాడు. ఇందులో కోహ్లీ అత్యధిక పరుగులు 96 నాటౌట్. అది కూడా బంగ్లాదేశ్‌పైనే చేశాడు. మరో 263 పరుగులు చేస్తే గేల్ రికార్డ్‌ను బ్రేక్ చేయవచ్చు. అయితే ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com