- అమెరికాలో పెరగనున్న మందుల ధరలు
- డిమాండ్ పెరగడం వల్ల ఉత్పాదక వ్యయం పెంపు
- మన దేశంనుంచి 45 శాతం జెనరిక్ మందుల ఎక్స్ పోర్ట్
- మన ఫార్మా కంపెనీలకు 50 శాతం బిజినెస్ అమెరికా నుంచే
- పెయిన్ కిల్లర్స్,కేన్సర్, గుండె జబ్బు మందుల ధరలపెంపు
- ప్రపంచంలో జనరిక్ మందుల ఉత్పత్తి దారుల మధ్య పోటీ
- ఆగిపోనున్న రిసెర్చ్,అభివృద్ధి
ఫార్మాస్యూటికల్ రంగంపై ట్రంప్ టారిఫ్ ల దెబ్బ అటు భారత్ ను, అమెరికాను కూడా ప్రభావితం చేయబోతోంది. ఫార్మాస్యూటికల్ రంగాన్ని టారిఫ్ ల నుంచి మినహాయించినట్లు గతవారం ప్రకటించినా ఈవారం ఆ ఉత్సాహాన్ని కాస్తా ఆవిరి చేశారు. ఫార్మాస్యూటికల్ రంగంపై కూడా టారిఫ్ లు తప్పవని సూచనప్రాయంగా తెలిపారు.త్వరలోనే టారిఫ్ లు అనౌన్స్ చేస్తామని తద్వారా మెజారిటీ ఫార్మస్యూటికల్ రంగం అంతా మన దేశం ముందు మోకరిల్లుతుందని ప్రకటించారు.. అమెరికా ప్రపంచ దేశాలకు చాలాపెద్ద మార్కెట్ అని అన్నారు.తన నిర్ణయంతో ఫార్మా కంపెనీలన్నీ తమ ఆపరేషన్స్ ను అమెరికాకు తరలించడం ఖాయమన్నారు.
భారత్ ఫార్మసూటికల్ రంగంపై టారిఫ్ ల ఎఫెక్ట్
మనదేశం ఫార్మస్యూటికల్ రంగంలో లీడింగ్ బిజినెస్ సెంటర్ గా ఉంది.ప్రపంచంలోనే జెనిరిక్ మందులను అమ్మే అతిపెద్ద దేశం మనదే.ప్రపంచ మార్కెట్ లో 20 శాతం వాటా మనదే. గత ఏడాది అమెరికాకు మన దేశం 9.7 బిలియన్ అమెరికన్ డాలర్ల ఫార్మస్యూటికల్ ఎగుమతులు చేసింది. మన దేశం నుంచి అమెరికాకు దాదాపు 45 శాతం జెనరిక్ మందుల దిగుమతులు జరుగుతున్నాయి.మన దేశంలో పేరొందిన ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు తమ ఉత్పత్తుల్లో మెజారిటీ వాటా అమెరికాకే ఎగుమతి చేస్తున్నారు.మన ఫార్మాస్యూటికల్ కంపెనీలకు 50 శాతం బిజినెస్ అమెరికా నుంచే జరుగుతోంది.
టారిఫ్ ఎఫెక్ట్ వల్ల ఫార్మా రంగంపై దెబ్బ
ట్రంప్ టారిఫ్ లు విధిస్తే దాని ప్రభావం మన ఇండస్ట్రీపైనా పడుతుంది.అమెరికాలో జెనరిక్ మందుల ధరలు పెరుగుతాయి. టారిఫ్ ల విధింపుతో మనకు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా జెనరిక్ మందులు తయారుచేసే దేశాలతో మనం పోటీనెదుర్కొనాల్సి ఉంటుంది. ఫార్మాస్యూటికల్ దిగుమతులపై టారిఫ్ విధిస్తే చవక ధరలకు దొరికే జెనరిక్ మందుల ధరలు పెరుగుతాయి. కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల మందుల ధరలు అమాంతం పెరుగుతాయి.
ఇక అమెరికాలో తయారయే మందుల రా ప్రొడక్ట్స్ ధరలు పెరుగుతాయి. దాంతో సాధారణంగా మెడికల్ షాపుల్లో దొరికే పెయిన్ కిల్లర్స్ రేటు సైతం పెరుగుతుంది. యాంటీ బయటిక్స్, గుండె సంబంధిత వ్యాధుల మందులు, ఆస్త్మా డ్రగ్స్ ధరలు కూడా పెరిగిపోతాయి. ఈ టారిఫ్ ల వల్ల డ్రగ్స్ కొరత ఏర్పడటమే కాదు.. అసలు వైద్య సంబంధ పరిశోధనలు, అభివృద్ధి ఆగిపోయే ప్రమాదముంది. ఉత్పాదనా వ్యయం పెరిగితే ఆ భారాన్ని ఆటోమేటిగ్గా వినియోగ దారునిపైనే వేస్తారని విశ్లేషకులు అంటున్నమాట. బయోమెడికల్ డ్రగ్స్, బ్యాండేజెస్ లాంటి సాధనాల ధరలు పెరగనున్నాయి.