సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయి మధ్యంత బెయిల్ పై విడుదలవడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందిచారు. శనివారం ఆయన అల్లు అర్జున్ కి ఫోన్ చేసి పరామర్శించారు. శుక్రవారం నుంచి జరిగిన సంఘటనలను అన్నీ అడిగి తెలుసుకున్నారు. తాను హైదరాబాద్ వచ్చిన వెంటనే ఇంటికి వచ్చి కలుస్తా అని అల్లు అర్జున్ తో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలసి ముంబయ్ లో జరుగుతున్న వార్2 హిందీ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆ కారణంగా తాను వెంటనే వచ్చి కలవలేకపోయిన్టుల ఎన్టీఆర్ అల్లు అర్జున్ తో అన్నట్లు సమాచారం.