మైసూరు అవధూత దత్తపీఠంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పరమాపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే 33 గంటలు నిర్విరామంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరగటం విశేషం. దేశం నలుమూలల నుండి 8 వందల పై చిలుకు భక్తులు ఈ అఖండ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఇంతమంది ఒకే వేదికపై చేసిన పారాయణ మహాయజ్ఞం వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నీస్ రికార్డులలో స్థానం సంపాదించుకుంది. మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీ స్వామీజీ వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భానికి వేదిక నిలిచిన అవధూత దత్తపీఠం నాద మంటపాన్ని భారత పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాంప్ విడుదల చేసింది. నాద మంటపం ప్రారంభించి 25 సంవత్సరాలుగా మన సనాతన ధర్మానికి శ్రీ స్వామీజీ చేస్తున్న సేవ గురించి ప్రశంసించింది.