ముంబై దాడులు.. భారతీయులు ఎప్పటికి మరిచిపోలేని మారణహోమం ఇది. ఈ మారణహోమం వెనకున్న మాస్టర్ మైండ్స్‌లో ఒకడు తహవూర్ రాణా. ఇన్నాళ్లుగా అమెరికా జైళ్లో ఉన్న ఈ ఉగ్రవాదిని ఎట్టకేలకు భారత్‌కు తీసుకొచ్చింది కేంద్రం. అన్ని చట్టపరమైన అడ్డంకులను తొలగించుకొని.. అమెరికా అనుమతితో అతడిని భారత్‌కు తీసుకొచ్చారు. ప్రత్యేక విమానంలో అత్యంత భద్రత మధ్య అతడిని కేంద్రం అతడిని భారత్‌కు తీసుకొచ్చింది.
వాట్ నెక్ట్స్?
తహవూర్ రాణాను ఎక్కడ ఉంచుతారు? ఏ జైలుకు తరలిస్తారు? అనేది చాలా గోప్యంగా ఉంచుతుంది కేంద్రం. ముంబై లేదా ఢిల్లీలో అతడిని ఉంచే అవకాశం కనిపిస్తోందన్న ప్రచారం జరిగింది. కానీ అతడిని తీహార్ జైళ్లో ఉంచుతారని సమాచారం. ఎక్కడ ఉంచినా అతడిని మాత్రం భారత్‌లో అధికారికంగా అరెస్ట్ చేసేది మాత్రం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులే. అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టిన అనంతరం వెంటనే అతడిని కస్టడీలోకి తీసుకోనున్నారు. రెండు వారాల పాటు అతడు NIA కస్టడీలోనే ఉంటాడని తెలుస్తోంది.
తహవూర్ రాణా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమించింది. మూడేళ్లు లేదా విచారణ పూర్తయ్యే వరకు NIA తరపున వాదనలు వినిపించనున్నారు మాన్.
ముంబై దాడుల కేసులో తహవూర్ రాణా మాస్టర్ మైండ్ అని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను సంపాదించి అమెరికాకు అందించింది. భారత్‌కు రాకుండా తప్పించుకునేందుకు రాణా అన్ని విధాలా ప్రయత్నించాడు. తన అప్పగింతను నిలిపివేయాలంటూ ఇటీవల రాణా యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. తనను భారత్‌లో చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. కానీ రాణా పిటిషన్‌ను తిరస్కరించింది అమెరికా కోర్టు. దీంతో అతను భారత్‌కు వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
పాకిస్థాన్ మూలాలున్న కెనడా జాతీయుడు రాణా. కెనడాలో వ్యాపారం చేస్తూన్నట్టు కలరింగ్ ఇస్తూ లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేసేవాడు. ముంబై పేలుళ్ల కేసులో కీలక నిందుతుడైడన డేవిడ్ కోలెమాన్ అలియాస్ దావూద్ గిలానికి కావాల్సిన ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసింది రాణానే. అంతేకాదు రాణా ముంబైకి వచ్చి ఉగ్ర దాడులకు కావాల్సిన ఏర్పాట్లను కూడా చేసినట్టు NIA గుర్తించింది. రాణా భారత్‌కు వచ్చి వెళ్లిన ఐదు రోజుల తర్వాత ముంబై ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 170 మంది అమాయక ప్రజలు మృతి చెందారు. 2009లో అమెరికా రాణాను అరెస్ట్ చేసింది.