23.9 C
Hyderabad
Wednesday, October 28, 2026

Live Video

spot_img

రానున్న మరిన్ని రఫేల్‌ ఫైటర్ జెట్స్.. రూ.63 వేల కోట్లతో డీల్..

రఫేల్ ఫైటర్ జెట్స్.. ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ పవర్‌ను సుపీరియర్‌గా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 4.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ ఇప్పుడు ఇండియన్ డిఫెన్స్‌ సెక్టార్‌లో కీలకం. అందుకే కేంద్రం ఇప్పుడు మరిన్ని ఈ ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు రెడీ అవుతుంది. ఈసారి నేవీ వర్షన్‌కు చెందిన 26 రఫేల్-M వర్షన్ ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ డీల్ విలువ రూ.63,000 కోట్లు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీల్‌ను ఫ్రాన్స్‌తో కుదుర్చుకోనుంది రఫేల్.

2023 జులైలో తొలిసారి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోగా అదే ఏడాది ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని సంప్రదించింది కేంద్రం. ఈ భారీ డీల్‌ కేవలం ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేయడం మాత్రమే కాదు.. ఫ్లీట్ మెయింటనెన్స్, లాజిస్టికల్ సపోర్ట్, పర్సనల్ ట్రైనింగ్, కొన్ని పరికరాలను స్వదేశీయంగా ఉత్పత్తి చేసే టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్ చేయడం.. ఇవన్నీ కూడా ఈ డీల్‌లోనే పొందుపరిచారు.

ఈ నెలాఖరులో ఫ్రెంచ్ ప్రభుత్వ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్న్ ఇండియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. 2031లోపు ఈ ఫైటర్ జెట్స్‌ అన్నీ కూడా నేవీలో చేరే అవకాశం ఉంది. మొత్తం 26 ఫైటర్ జెట్స్‌ల 22 సింగిల్ సీటర్ ఫైటర్ జెట్స్‌కాగా మరో నాలుగు ట్విన్-సీటర్ ఫైటర్ జెట్స్. ఇవన్నీ కూడా INS విక్రాంత్ నుంచి తమ సేవలను అందిస్తాయని తెలుస్తోంది.

ప్రస్తుతం మిగ్ -29కే ఫైటర్ జెట్స్‌ తమ సేవలను కొనసాగిస్తున్నాయి. అయితే వీటి స్థానంలో రఫేల్‌ను చేర్చాలన్నది కేంద్రం ఆలోచన. ప్రస్తుతం INS విక్రాంత్‌ నుంచి సేవలందిస్తున్న మిగ్ ఫైటర్ జెట్స్‌ INS విక్రమాదిత్య నుంచి తమ సేవలను కొనసాగిస్తాయి. రఫెల్ M వర్షన్ అనేది ప్రపంచంలోని అత్యంత ఆధునిక నావల్ ఫైటర్ జెట్స్‌లో ఒకటి. ఇవీ సాఫ్రన్ గ్రూప్‌ రీఇన్‌ఫోర్స్‌డ్ ల్యాండింగ్ గేర్స్‌తో ఉంటాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌పై ల్యాండింగ్‌, టేకాఫ్‌కు అనుకూలంగా ఉంటాయి.

హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరుగుతున్న సమయంలో ఈ డీల్ కుదరడం భారత తీర జలాలకు మరింత రక్షణ పెరిగినట్టే అని చెప్పాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com