31.2 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

53 ఏళ్ల వయసులో ఠారెత్తిస్తున్న టబు

తెలుగు చిత్రసీమలో తక్కువ సినిమాలే చేసినా.. చాలా తక్కువ మంది భామలు ఈ రోజుకు ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో సీనియర్ బ్యూటీ టబు ఒకరు. 1990ల్లో టాలీవుడ్‌లో హవా కొనసాగించిన టబు తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌కే పరిమితమై వరుస చిత్రాలతో తెగ హడావిడి చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టబు…కొన్ని బోల్డు పిక్చర్స్ విడుదల చేసింది.

హీరో అజెయ్ దేవగణ్ కు మంచి స్నేహితురాలు కాగా ఇంకా పెళ్లి చేసుకోని టబు 53 ఏళ్ల వయసులో కూడా తన అంద చందాలతో మత్తెక్కిస్తోంది. అత్త, వదిన పాత్రలు చేస్తున్న టబు బోల్డు పోజులతో కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతోంది. 1993లో నిన్నే పెళ్లాడతా సినిమా తర్వాత నాగార్జున, టబు రిలేషన్ పై అనేక రూమర్లు రాగా ప్రేమదేశం సినిమాతో యువకుల హృదయాల్లో ప్రేయసిగా నిలిచిపోయింది.

హైదరాబాద్‌కు చెందిన టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. 1971 నవంబర్ 4వ తేదీన జమాల్ అలీ హష్మీ, రిజ్వానా దంపతులకు హైదరాబాదీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పాకిస్తాన్‌లో నటుడిగా కొన్ని సినిమాలు చేశాడు. 1970లో భారతదేశానికి వచ్చిన టబు తండ్రి ఆమెకు మూడేళ్ల వయసులో కుటుంబాన్ని విడిచిపెట్టాడు.

బాలీవుడ్‌లో బాలనటిగా సినిమాలు చేసిన టబు… కొన్నేళ్ల తర్వాత అక్కడే హీరోయిన్‌గా పరిచయం అయింది. ‘కూలీ నెం 1’ మూవీతో టాలీవుడ్‌ కు పరిచయం అయింది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

బాలకృష్ణతో  ‘పాండురంగడు’ సినిమా తర్వాత టబు టాలీవుడ్‌ లో కొంత గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’తో ఆమె రీఎంట్రీ ఇచ్చి  ఆకట్టుకుంది.

ఐదు పదులు దాటిపోయినా టబు మాత్రం గతంలో కన్నా ఎక్కువ సినిమాలు చేస్తోంది. ‘దృశ్యం 2’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ‘భూల్ భులయా’లో ద్వీపాత్రభినయంతో విమర్శకులను మెప్పించింది. 2024లో ‘కుత్తే’, ‘భోళా’ సినిమాలు రాగా ఇప్పుడు ‘ఖుఫియా’, ద క్రూ తదితర సినిమాలతో పాటు డూన్ ప్రోఫెసీ వెబ్ సిరీస్ లో పవర్ పాత్ర పోషించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com