సొంత గడ్డపై ఓడిన అవమానం.. విదేశీ గడ్డపై BGTలో జరిగిన మరింత ఘోర అవమానం.. ఈ రెండింటిని ఇంకా టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రారంభమవుతుంది ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్. ఇప్పటికే ఈ రెండు టీమ్స్ పోరుకు సిద్దమయ్యాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ పొట్టి పోరుకు సర్వం సిద్ధమైంది.
ఛాంపియన్స్ ట్రోఫికి ముందు జరుగుతున్న ఈ సిరీస్ ఎవరి బలాలు ఏంటన్నది టెస్ట్ చేసుకునేందుకు వేదికగా మారనుంది. ఇప్పటికైతే సై అంటే సై అనే తీరులోనే రెండు టీమ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం ఐదు టీ20లు జరుగుతుండగా.. మరి బోణి కొట్టేది ఎవరన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఈడెన్ పిచ్ అంటేనే బ్యాట్స్‌మెన్‌కు ఓ వరం లాంటిది. దీంతో ఇరు టీమ్స్ భారీ స్కోర్‌పై కన్నేశాయనే చెప్పాలి. మరి ఈ పిచ్‌పై చాలా కాలం తర్వాత ఇంటర్నేషనల్స్‌కు ఎంట్రీ ఇస్తున్న షమీ ఎలా బంతులు విసురుతాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతుంది. మరోవైపు మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్ ఫైనల్ టీమ్‌ను అనౌన్స్ చేసింది. యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ విధ్యంసం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్‌లో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షమీ ఫిట్‌నెస్‌ను.. సంజూ శాంసన్ తన ఫామ్‌ను కొనసాగించి విజృంభిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని.. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ కూడా తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక యువ బ్యాటర్లు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మలు కూడా చెలరేగి ఆడితే ఫ్యాన్స్ కళ్లకు పండగే అని చెప్పాలి.
ఇక ఇంగ్లండ్ వైపు నుంచి చూస్తే జోస్ బట్లర్ సేన కూడా గట్టిగానే కనిపిస్తోంది. సామ్ కరన్ విల్ జాక్స్ లేకపోవడం మైనసే అయినా.. మెక్ కలమ్, జాకబ్ మెతెల్, జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్, సాల్ట్, లివింగ్ స్టన్ సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.