సిరియా రెబల్స్ వశమైంది. రెండు వారాల్లో దేశం మొత్తాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు రెబల్స్. ఇప్పుడు హయాత్ తహరీర్ అల్-షామ్.. అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది. రెబల్స్ దెబ్బకు ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న బషర్ అల్ అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం కుటుంబంతో సహా అతను రష్యాలో ఆశ్రయం పొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా కూడా ధ్రువీకరించింది. దీంతో అస్సాద్ విమానం కూలిపోయిందన్న వార్తలు కేవలం ప్రచారమని తేలిపోయింది.
మరోవైపు సిరియాపై ఇజ్రాయల్, అమెరికా గగనతల దాడులు చేశాయి. రాజధాని డమాస్కస్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించింది ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్. డమాస్కస్‌లోని ఓ రిసేర్చ్ సెంటర్‌పై ఈ దాడులు జరిపింది. గతంలో ఇక్కడే ఇరాన్ సైంటిస్టులు మిసైల్స్‌ను డెవలప్ చేసేవారని ప్రకటించింది ఇజ్రాయెల్. ఇక్కడే మిలటరీ డేటా, ఎక్విప్‌మెంట్, మిసైల్ పార్ట్స్‌ను స్టోర్ చేసేవారని చెబుతోంది ఇజ్రాయెల్. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికన్ ఆర్మీ ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించింది. మొత్తం 75 ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొని ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో బీ-52 బాంబర్లను కూడా ఉపయోగించినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. సిరియాలో మళ్లీ ఐసిస్ బలపడటాన్ని అమెరికా చూస్తూ ఊరుకోదని ప్రకటించింది.
సిరియా పరిణామాలపై అమెరికా స్పందించింది. అస్సాద్ శకం ముగియడం ఆ దేశానికి మంచిదే అన్నారో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్. అయితే సిరియా మళ్లీ ఐసిస్ చేతిలో పడకుండా చూసుకోవాలని హెచ్చరించారు. సిరియాలో జరుగుతున్న పరిణామాలపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అస్సాద్ శకం ముగియడం మంచిదే అన్నారు ట్రంప్. అస్సాద్‌ను రష్యా ఏకాకి చేసిందని.. అవసరమైన సమయంలో అతడికి సాయం చేయలేదన్నారు ట్రంప్. అయితే దీనికి కారణాలను కూడా చెప్పారు ట్రంప్. రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంపై ఫోకస్ చేసిందని అందుకే సిరియాను అంత సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అసలు సిరియా విషయంలో రష్యా జోక్యం చేసుకోవడమే పెద్ద తప్పన్నారు ట్రంప్.