అదాని రేవంత్ దోస్తీ అంటూ టిఆర్ఎస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఆదాని రేవంత్ భాయి భాయి అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను…అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు. అదాని రేవంత్ భాయి భాయి అంటూ ఉన్న టీషర్ట్లు లోపలికి అనుమతించమంటూ పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు గులాబీ నేతలు నినాదాల చేయటంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టి షర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నాంటూ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు… బతకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు చేశారు.