కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ ‘UI ది మూవీ’ చిత్రంతో రాబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత.
కథ 2040 సంవత్సరంలో జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్, COVID-19, ద్రవ్యోల్బణం, ఏఐ, నిరుద్యోగం, యుద్ధం యొక్క నిరంతర ముప్పు అస్తవ్యస్తమైన, బాధాకరమైన సమాజానికి దారి తీస్తాయి. ఇందులో ఉపేంద్ర నియంతగా కనిపించారు. మార్పు కోసం, న్యాయం కోసం, మంచి భవిష్యత్తు కోసం కష్టజీవులు నిరసనలకు దిగుతారు. ఇప్పుడు పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర రూత్ లెస్ గా కనిపించారు.
ఈ చిత్రంలో రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్లింప్స్ లో అనౌన్స్ చేసినట్లుగా UI మూవీ డిసెంబర్ 20, 2024న విడుదల అవుతుంది.