- వీరిద్దరితో పాటు వచ్చిన మరో ఇద్దరు వ్యోమోగాములు
- ఫ్లోరిడా సముద్ర జలాల్లో సేఫ్ ల్యాండ్ అయిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్
అనివార్య పరిస్ధితుల్లో తొమ్మిది నెలల అంతరీక్షవాసం ముగించుకుని బుధవారం తెల్లవారు జామున భూమి మీదకు చేరుకున్నారు భారత సంతతి వ్యోమోగామి సునీతా విలియమ్స్, అమెరికన్ వ్యోమోగామి బుచ్ విల్‌మోర్‌లు. భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువ జామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యారు. ఇద్దరు వ్యోమోగాములు సురక్షితంగా భూమిపై దిగడంతో ఏవత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. పారాచూట్ల సాయంతో సముద్రజలాల్లోకి అంతరిక్షం నుంచి దిగిన డ్రాగన్ క్యాప్సూల్ ను స్పేస్ ఎక్స్, నాసా సంస్థలకు చెందిన సహాయక బృందాలు రెస్క్యూ చేశాయి. స్పేస్ ఎక్స్ సంస్థ కు చెందిన ఓ పెద్ద రికవరీ బోటు డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండ్ అయిన చోటుకు రాగా దాంట్లో ఉండే టెక్నీషియన్స్ డ్రాగన్ క్యాప్సూల్ కు రోప్స్ కట్టి దాన్ని అతి జాగ్రత్తగా రికవరీ బోట్ లోకి ఎక్కించారు. సునీతా, విల్మోర్లతో పాఉ నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమోగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ లు కూడా ఇదే స్పెస్ షిప్ ద్వారా ఐఎస్‌ఎస్ నుంచి భూమిపైకి చేరుకున్నారు.
మంగళవారం ఉదయం 8.15 గంటలకు క్రూడ్రాగన్ స్పెష్ షిప్ హ్యచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఉదయం 10.35 గంటలకు క్రూడ్రాగన్ ఇంటర్ నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి విడిపోవడం మొదలయ్యింది. ఈ ప్రక్రియ 20 నిమిషాలు కొనసాగింది. ఆ వెనువెంటనే 17 గంటలు ప్రయాణించి బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యింది. అంతరీక్ష పరిశోధనల నిమిత్తం ఎనిమిది రోజులు ఉండే విధంగా గత సంవత్సరం జూన్ 5వ తేదీన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్ కు వెళ్లారు. అయితే అనివార్యమైన కొన్ని సాంకేతిక కారణాల వల్ల 2024 జూన్ 5న వెళ్లిన ఈ ఇద్దరు వ్యోమోగాములు 2025 మార్చి18వ తేదీ వరకూ అంటే 286 రోజుల పాటు భూమికి 400 కిలో మీటర్ల దూరంలో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.