26.7 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

రాజధాని పనుల పునఃప్రారంభ సభ విజయవంతం

  • ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు
  • మోడీ సభ సక్సెస్‌ అవ్వడంపై కృతజ్ఞతలు చెప్పిన సీయం చంద్రబాబు

రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించినందుకు ప్రజలకు, అధికారులకు, కూటమి భాగస్వామ్య రాజకీయ పక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి నిర్మాణం నిన్న పునఃప్రారంభించడానికి కారకులైన రాజధాని ప్రాంత రైతులను ముఖ్యమంత్రి అభినందనందించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రభుత్వ యంత్రాంగాన్ని చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియేశారు. అలాగే అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లిన మీడియా, సోషల్‌ మీడియాకు చంద్రబాబు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేశారు.  ప్రజల సహకారంతో, కేంద్ర మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని సీయం చంద్రబాబు పునరుద్ఘాటించారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి…. మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇస్తు్న్నట్లు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com