22 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

మున్సిపాలిటీల్లో సమ్మె సైరన్‌

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికులు ఈనెల 20 నుంచి సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే సమ్మె నోటీసులు అధికారులకు అందజేశారు. మంగళవారం మున్సిపల్ శాఖ అదనపు డైరెక్టర్ మురళీకృష్ణ గౌడ్‌కు ఏపీ మున్సిపల్ కార్మికుల సంఘం ప్రతినిధులు నోటీసు ఇచ్చారు. కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించడమేకాక, పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని మున్సిపల్‌ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు.

గతంలో కూడా, 2024లో ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సమాన పనికి సమాన వేతనం సహా ఇతర డిమాండ్లను ఆందోళనల ద్వారా తెలుపగా, ప్రభుత్వంతో జరిగిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. అప్పట్లో ప్రభుత్వం రూ.15 వేలు జీతంతో పాటు రూ.6 వేలు హెల్త్ అలవెన్స్ కలిపి మొత్తం రూ.21 వేలు చెల్లించేందుకు అంగీకరించింది. అంతేకాకుండా కనీస వేతనంగా రూ.21 వేలు పరిగణిస్తామని హామీ ఇచ్చింది. సమ్మె కాలంలో జీతాలు, కేసుల ఉపసంహరణ, ప్రమాదాల్లో మృతిచెందిన కార్మికులకు పరిహారం మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతామని తెలిపింది. దీంతో కార్మికులు అప్పట్లో సమ్మెను విరమించారు.

ఇప్పుడు.. మరోసారి కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు పెండింగ్ అంశాలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, పురపాలక శాఖ అధికారులు కార్మికులతో చర్చలు జరిపేందుకు సన్నద్ధమవుతున్నారు. సమస్యలు సామరస్యంగా పరిష్కారమవుతాయని అందరూ ఆశిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com