-
ఆలయ శిఖరం నీలచక్రంపై నున్న జెండాను తీసుకెళ్లిన గద్ద
-
ఆదివారం సాయంత్రం ఘటన
-
నీలచక్రానికి విశిష్ట ప్రాధాన్యత
-
నీల చక్రంపై ఎగిరే పతిత పావన జెండా
-
ఆ జెండాను తీసుకుని సముద్రం మీదుగా వెళ్లిన పక్షి
-
ప్రతీరోజు పూజానంతరం ఎగరేయనున్న ఆలయాధికారులు
-
పతిత పావన జెండాకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత
-
ప్రతీరోజు జెండాను మార్చే సంప్రదాయం
-
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన
-
ఎలాంటి ప్రకటనా చేయని ఆలయాధికారులు
ఒడిషాలోని పూరి జగన్నాధుని ఆలయ ప్రాంగణంలో ఓ వింత జరిగింది. దీనిని భక్తులు, ఆలయ అధికారులు కూడా విచిత్రంగా చూశారు. ఇప్పుడీ వింత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలయ శిఖరంపై నీల చక్రంపై ఉన్నపతిత పావన జెండాను ఓ గద్ద తీసుకు వెళ్లి గాలిలో తిప్పుతూ ఆలయం చుట్టూ తిరగడం సంచలనంగా మారింది.
ఆదివారం సాయంత్రం భక్తులు ఎప్పటి లాగే జగన్నాథ స్వామి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో ఉండగా ఓ గద్ద వచ్చి నీలచక్రంపై ఉన్న పతిత పావన జెండాను నోట కరచి ఆపై ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఆ పై జెండాను నోట కరచి సముద్రం వైపు ఎగురుతూ వెళ్లిపోయింది. గద్ద చేసిన ఈ వింత పనికి భక్తులు అవాక్కయ్యారు. ఈ ఘటన మంచి చెడుల గురించి ఎవరూ విశ్లేషించనప్పటికీ అదొక అబ్బురమైన సంఘటనగా చర్చించుకున్నారు. కొందరు ప్రత్యక్ష సాక్షులు దీనిని తమ సెల్ ఫోన్లలో బంధించి ఆపై సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
అయితే ఈ సంఘటన పై ఆలయ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిని సింబాలిక్ అనుకోవాలా లేక ఆధ్యాత్మిక ఘటనగా చూడాలా అన్నదానిపై స్పష్టత రాలేదు.
పతిత పావన జెండా :
దీనికి చాలా ప్రాముఖ్యత, పవిత్రత ఉంది. భక్తులు ఆలయంలోకి ప్రవేశించగానే మొదట దర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక పరంగా ఈ జెండా అత్యంత విశేషమైనది. పవిత్రమైనది. ప్రతీరోజు ఆలయ ప్రధాన పూజారులు దీనిని ఆలయంపై ఎగుర వేస్తారు.ఈ జెండాను ప్రతీ రోజు సాయంత్రం మళ్లీ మారుస్తారు. కొత్త జెండా ఎగుర వేస్తారు.ఇవి కాక భక్తులు సమర్పించుకునే జెండాలను సైతం నీల చక్రం కింద కట్టేస్తారు.
సోషల్ మీడియాలో విస్తృత చర్చ :
ప్రత్యక్ష సాక్షులు ఈ ఘట్టాన్ని సెల్ ఫోన్లలో బంధించి ఆపై సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్ గా మారింది. కొందరు దీనిని అసాధారణమైన, సహజ ఘటన గానే భావించినా మరికొందరు దీనికి ఆధ్యాత్మికతను జోడించి కామెంట్లు చేస్తున్నారు. ఆలయ పవిత్రత, ఆ జెండాకున్న ప్రాధాన్యత దృష్ట్యా గ్రద్ద దానిని ప్రదక్షిణలు చేసినట్లు ఆకాశంలో కొద్ది సేపు తిరిగి తీసుకెళ్లిన విధానం ఎంతో మహిమాన్వితమైన ఘటనగా భావిస్తున్నారు.