24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

ఈశాన్య భారతంలో స్టార్ లింక్… సైనికబలగాలకు సవాల్

స్టార్ లింక్.. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ సంస్థ ఇండియాలో అడుగుపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికే స్టార్ లింక్ సేవలు ఇండియాలో మొదలయ్యాయి. ఏదో మహానగరంలో కాదు.. ఇండియా, మయన్మార్ సరిహద్దుల్లో స్టార్ లింక్ సేవలందిస్తోంది. అది కూడా మిలిటెంట్లు స్టార్ లింక్‌ నెట్‌ను ఉపయోగించుకొని భద్రతా బలగాలకు చెక్ పెట్టే పనిలో ఉన్నాయి. ఈ భూమ్మీద ఏ మారుమూల ప్రదేశానికి వెళ్లినా, ఆఖరికి నడి సముద్రంలో కూడా ఇంటర్నెట్ పొందగలిగే అవకాశం ఇస్తుంది ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్ లింక్. ఎలాంటి టవర్స్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్‌ నుంచి ఇంటర్నెట్‌ పొందే అవకాశం ఉంటుంది. వంద దేశాల్లో ఉన్న స్టార్ లింక్ సేవలు ఇప్పటివరకైతే ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ అప్పుడే మిలిటెంట్లు మాత్రం స్టార్‌లింక్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.

మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు కలిసి ఓ జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇందులో రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్‌ అనే మిలిటెంట్ గ్రూప్‌ స్థావరాన్ని గుర్తించారు. అక్కడి నుంచి భారీగా ఆయుధాలు, గ్రైనేడ్లు, బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ స్టార్‌ లింక్‌ రూటర్, యాంటెనాను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మణిపూర్ పోలీసులు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇండియాలో ఇంకా ప్రారంభం కాని స్టార్ లింక్‌ సేవలను మిలిటెంట్లు ఎలా ఉపయోగిస్తున్నారు? అనే క్వశ్చన్ తెరపైకి వచ్చింది.

మిలిటెంట్లు స్టార్ లింక్ సేవలను ఉపయోగిస్తున్నారనే దానిపై స్పేస్‌ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఇదంతా అబద్ధం.. అసలు ఇండియాపై స్టార్ లింక్‌ సేవలు ఉండవనన్నారు. ఇదే నిజమైతే మిలిటెంట్ల వద్దకి స్టార్ లింక్ ఎక్విప్‌మెంట్ ఎలా వచ్చిందన్నది తేలాల్సి ఉంది. నిజానికి మణిపూర్‌ మిలిటెంట్‌ గ్రూప్‌లకు మయన్మార్‌ నుంచి సహాయ సహాకారాలు పుష్కలంగా అందుతున్నాయి. అయితే మణిపూర్‌లో కూడా స్టార్‌లింక్‌కు పర్మిషన్‌ లేదు. కానీ రిపోర్టులను గమనిస్తే.. మయన్మార్‌లో దాదాపు 3 వేల స్టార్‌లింక్ కనెక్షన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా మిలిటెంట్లను కట్టడి చేయడానికి ఇంటర్నెట్‌పై బ్యాన్ విధించినా.. ఇలా స్టార్‌లింక్‌ సేవలను ఉపయోగించుకొని భద్రతా బలగాలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయనే విషయం మాత్రం క్లారిటీ ఇచ్చింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com