స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్ & సెటిల్ కింగ్ ప్రొడక్షన్ నెం:1లో వేణుబాబు నిర్మాతగా ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వంలో పవన్ చరణ్, జీవీ సంగీతాన్ని అందిస్తూ దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేస్తూ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ అండగా త్వరలోనే ఇతర అప్డేట్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర నటి ప్రియాంక సింగ్ మాట్లాడుతూ… “నేను ఈ నిర్మాణ సంస్థలో పనిచేయడం మొదటిసారి. జీవి విశ్వనాథ్ దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడైన జీవి మొదటిసారి దర్శకత్వం చేస్తున్నారు. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు. కాబట్టి ఈ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది. అందుకుగాను ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో నటిస్తున్న తోటి నటీనటులతో, ఈ చిత్ర బృందంతో పనిచేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
నటుడు అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ… “మేమంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేస్తున్నాము. ఈ చిత్ర కథని నమ్మి సినిమా చేస్తున్నాము. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాము. త్వరలోనే ఈ సినిమా ద్వారా థియేటర్లలో కలుద్దాము” అన్నారు.
నటి పూజిత పుందిర్ మాట్లాడుతూ… “జెండర్ సమానత్వంపై కామెడీ రూపంలో వస్తున్న ఈ చిత్రం మంచి కామెడీతో ఉండబోతుంది. జీవి గారి దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ తదితరులు నటిస్తున్నారు.