– ఏపీసీసీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం
– హాజరైన వామపక్ష పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలు
– అమిత్‌షా రాజీనామా చేయాలని తీర్మానం
– తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపుతామన్న షర్మిల
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఎగతాళి చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని విజయవాడలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఈమేరకు తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తామని ఏపీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. అంబేద్కర్ అంటే లెజెండ్ అని, అంబేద్కర్ అంటే ఐడియాలజీ అనే విషయం బీజేపీకి ఎప్పటికీ అర్థం కాదని విమర్వించారు. అమిత్‌షాతో పాటు.. బీజేపీక కూడా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా రాజీనామా డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ క్యాంపెయిన్ చేస్తున్నామన్నారు. మతం పేరుతో,కులం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీ దేశ సంపదను అదానీకి దోచి పెట్టిందని విమర్శించారు. ఇవన్నీ చాలవన్నట్లు దేశాన్ని కాషాయమయం చేయాలని చూస్తున్నారన్నారు. మహాత్మాగాంధీని విలన్‌గా క్రియేట్ చేస్తున్నారని, గాంధీని చంపిన వారిని దేవుడు అంటున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారన్నారు. దళితులను అవమానిస్తున్నారని షర్మిల ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అంటే బీజేపీకి గౌరవం లేదన్నారు. బీజేపీ కి కావలసింది మనుస్మృతి రాజ్యాంగం అని విమర్శించారు. బీజేపీకి స్వాతంత్ర్య సమరయోధులు అంటే లెక్క లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు RSS కి స్వాతంత్య్ర పోరాటానికి సంబంధం లేదన్నారు. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్‌కి ఘోరమైన అవమానం జరిగిందన్నారు. రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి బాబు,పవన్, జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీపీఎం నేత బాబురావు మాట్లాడుతూ.. మోద మనసులో మాట అమిత్ షా చెప్పారన్నారు. పార్టీలకు అతీతంగా అమిత్ షా వ్యాఖ్యలను ఖండించాలన్నారు. గడపలో కులం, గడప దాటితే హిందువులం అంటున్నారని.. ఇదో పెద్ద ప్రమాదమని హెచ్చరించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక రాజ్యాంగం స్ఫూర్తికి ప్రమాదమన్నారు.