24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

ఇవాళ తేదీ.. అరడజను, డజను, రెండు డజన్లు.. కన్ఫ్యూజ్‌ అవుతున్నారా?

ఇవాళ ఆరో తేదీ, డిసెంబర్‌ నెల 2024వ సంవత్సరం. అయితే ఏంటి? అంటారా… అందులోనే ఉంది అసలు మర్మం. కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. ఇవాళ్టి తేదీ, నెల, సంవత్సరాన్ని కాస్త నిశితంగా గమనిస్తే.. ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను మనం గ్రహించవచ్చు. ఈ మూడింటికీ ఓ లింకుంది.పైగా.. ఇలాంటి అరుదైన లింకున్న తేదీ చాలా అరుదుగా వస్తుంది. ఆరో తేదీ అంటే ఆరు. డిసెంబర్‌ నెల అంటే 12. ఆరును రెండుతో గుణిస్తే 12 వస్తుంది. సంవత్సరంలో మొదటి రెండు అంకెలు తీసేస్తే.. మనం తరచుగా రాసేలా చూస్తే 24. అంటే.. 12ను రెండుతో గుణిస్తే 24 వస్తుంది. ఆరు రెళ్లు పన్నెండు.. పన్నెండు రెళ్లు 24. సింపుల్‌గా.. కాస్త అందరం వాడే భాషలో చెప్పుకోవాల్సి వస్తే.. ఆరు అంటే అరడజను. 12 అంటే డజను. 24 అంటే రెండు డజన్లు. అంటే.. అరడజను, డజను, రెండు డజన్లుగా చెప్పుకోవచ్చు.

ఇలాంటి లింకున్న రోజులు చాలా అరుదుగా వస్తాయి. అయితే, వాటిని మనం గమనిస్తే.. నిశితంగా పరిశీలిస్తేనే వాటిలో దాగి ఉన్న ఇలాంటి లోగుట్టు బయటకు వస్తుంది. లేదంటే రోజూ మాదిరిగానే ఇవాళ కూడా మరికొద్ది గంటల్లో కాలగర్భంలో కలిసిపోతుంది. తెల్లవారుతుంది. క్యాలెండర్‌లో ఇవాల్టి తేదీ చిరిగిపోతుంది. సో.. ఈ కొద్దిగంటలైనా ఇలాంటి అరుదైన లింకును ఆస్వాదించండి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com