23 C
Hyderabad
Wednesday, October 28, 2026

Live Video

spot_img

కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో సౌతిండియా డైరక్టర్ పేరు?

ఉపాసనా సింగ్ ఆరోపణల నేపధ్యంలో టాలీవుడ్ లో చర్చ

తెలుగు శుభలగ్నం కి హిందీ రీమేక్ అయిన జుడాయి, మైనే ప్రేమ్ కి దివానీ హూలాంటి సినిమాల్లో సహనటి పాత్రల్లో నటించిన ఉపాసన చాలా తక్కువ మందికే గుర్తుండి ఉంటుంది. కపిల్ శర్మ కామెడీ నైట్స్ షోలో సహ యాంకర్ కూడా అయిన ఈమె రీసెంట్ గా ఓ సౌతిండియన్ డైరక్టర్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఆ డైరక్టర్ అనుచిత ప్రవర్తన వల్ల అనిల్ కపూర్ పక్కన హీరోయిన్ అవకాశం వచ్చినా వదులుకున్నానని తెలిపింది. ఓ సౌతిండియా డైరక్టర్ తనను ముంబైలోని జుహూ హోటల్ కు రమ్మని పిలిచాడని, మీటింగ్ ఉందని చెబితే వెళ్లినట్లు, తీరా వెళ్లాక అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. తనకన్నా వయసులో చాలా పెద్ద వాడైన ఆ డైరక్టర్ తనతో ప్రవర్తించిన తీరు తనను చాలాకాలం వేధించిందని, వెంటాడిందని తన కెరీర్ పైనే ప్రభావం చూపిందని తెలిపింది.

రాత్రి11.30కి హోటల్ కి రమ్మన్నాడు..

ఓ హిందీ మూవీలో అనిల్ కపూర్ సరసన హీరోయిన్ గా తనను ఆ డైరక్టర్ బుక్ చేసినట్లు సినిమా అగ్రిమెంట్ కూడా సైన్ చేసినట్లు తెలిపింది. తాను ఎప్పుడు ఆ డైరక్టర్ ఆఫీస్ కి వెళ్లినా వెంట తల్లినో, చెల్లినో తీసుకెళ్లేదాన్నని తెలిపింది. వారినెందుకు వెంట తీసుకొస్తావ్ అని ఆ డైరక్టర్ విసుక్కునేవాడని ఉపాసన తెలిపింది. ఓ రోజు  రాత్రి11.30 కి కాల్ చేసి సినిమా సిటింగ్ ఉందని రమ్మన్నాడని చేతిలో కారు లేదని మరుసటిరోజు వస్తానని తాను  చెప్పగా సిటింగ్ అంటే అర్ధం తెలీదా అని ఎదరు తనను ప్రశ్నించాడని ఉపాసన వెల్లడించింది. ఆ సమావేశం తర్వాత తాను నిద్రపోలేక పోయానని మరుసటి రోజు డైరక్టర్ ఆఫీస్ కి వెళ్లి చెడా మడా తిట్టేసానని చెప్పింది.

బాంద్రాలోని ఆ డైరక్టర్ ఆఫీస్ కు వెళ్లేసరికి లోపల ఎవరితోనో మాట్లాడుతున్నాడని, వెయిట్ చేయమని రిసెప్షనిస్టు సూచించిందని అయినా తాను తలుపులు తోసుకు లోపలికి వెళ్లి పంజాబీ భాషలో ఐదు నిమిషాలు ఆపకుండా తిట్టేశానని ఉపాసన చెప్పింది. ఆ టైమ్ లో నలుగురు వ్యక్తులతో మీటింగ్ లో ఉన్న ఆ డైరక్టర్ ఊహించని ఈ ఘటనకు షాక్ తిన్నాడని అంది. కానీ బయటకు వచ్చాక తాను అనిల్ కపూర్ తో నటిస్తున్నట్లు చాలా మందికి చెప్పుకున్న విషయం గుర్తొచ్చి ఏడుపు ఆగలేదని ఉపాసన అంది. వారం రోజులు తన రూమ్ దాటి బయటకు రాలేదని, ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నట్లు తెలిపింది. పరువు పోయిందని ముందు బాధపడినా ఆ వారం రోజుల వేదనే తనను బలంగా చేసిందంది. ఆ తర్వాత ఎప్పుడూ బాధపడలేదని, తాను ఇండస్ట్రీలో ఉండే ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లి సాయంతో చిత్రపరిశ్రమలో కొనసాగానని ఉపాసన గుర్తు చేసుకుంది. చాలాకాలం తర్వాత ఉపాసన చేసిన ఈ ఆరోపణలతో ఆ సౌతిండియన్ డైరక్టర ఎవరా అన్న ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com