- రాజకీయ రంగంలో గిబ్లి ఇమెజెస్ హడావుడి
- ప్రముఖ నేతలంతా ఫాలో అవుతున్న ట్రెండ్
- తమ ఫోటోలను చిత్రరూపంలో అప్లోడ్ చేస్తున్న నేతలు
- ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ సైతం గిబ్లి ట్రెండ్ లో
- మోడీ పై అనేక రకాల గిబ్లి చిత్రాలు
- సెలబ్రిటీలు, నేతలు, క్రీడాకరులు అందరికీ గిబ్లి ఫీవర్
- అందరినీ అలరిస్తున్న సరికొత్త టెక్నాలజీ
డిజిటల్ మీడియాలో పొలిటికల్ లీడర్లు ఈ మధ్య కాలంలో వినియోగిస్తున్న లేటెస్ట్ ట్రెండ్ గిబ్లి ఇమేజెస్.. మన ఫోటోస్ ని ఇలా స్టిల్ పిక్చర్స్ లా ఏఐ సాయంతో డిజైన్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం. చాలా మంది ఇప్పుడు ఈ గిబ్లి టెక్నాలజీ ద్వారానే ప్రత్యర్ధులకు కౌంటర్ పంచ్ లు వేస్తున్నారు. మన అపోనెంట్ బలహీనత ను ఈ ఇమేజ్ రూపంలో సింబాలిక్ గా ఇలా ప్రచారం చేయడం. తాజాగా సోషల్ మీడియాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు, నోటు వివాదానికి చెందిన ఇమేజ్ ను సెటైరికల్ గా సర్క్యు లేట్ చేస్తోంది బీఆర్ ఎస్ పార్టీ.ఆ ఇష్యూ పై అవగాహన ఉన్న వారికి గిబ్లి ఇమేజ్ లలో పంచ్ అర్ధమవుతుంది కానీ ఆ ఇష్యూ తెలియకపోతే ఆ ఇమేజ్ ను అర్ధం చేసుకోవడం కష్టం.. కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ రాకతో ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు రాజకీయ నేతలందరూ వాడుతున్న పదునైన ఆయుధం గిబ్లి ఇమేజెస్..
గిబ్లి నయా ట్రెండ్
ఈతరం వారు ఎక్కువగా వినియోగించుకుంటున్న సోషల్ మీడియా సాధనం గిబ్లి ఇమేజెస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రినారా లోకేష్ సైతం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇదో వైవిధ్యమైన భావ ప్రకటనగా గుర్తింపు పొందింది. గిబ్లి స్టైల్ చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది.
ఏపీలో గిబ్లి ట్రెండ్..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2024 నాటి తన ప్రమాణ స్వీకార చిత్రాలను గిబ్లి ఇమేజ్ లలో పెట్టుకున్నారు. అప్పటి ప్రమాణానికి ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో ఆ ఇమేజెస్ అన్నీ ఇలా చిత్రాల రూపంలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక మంత్రి నారా లోకేష్ తన కుటుంబం ఫోటోస్, పబ్లిక్ తో తన ఇంరాక్షన్ చిత్రాలను గిబ్లి రూపంలో భద్రపరచి సోషల్ మీడియా అక్కౌంట్లలో పెట్టుకున్నారు.ఇక ఏపీ బీజేపి యూనిట్ ఏపీ భవితను మార్చేసిన త్రయం అంటూ మోడీ, చంద్రబాబు, పవన్ ల ఇమేజ్ ను షేర్ చేసింది. అంతేకాదు మాజీ ప్రధాని వాజపేయి, డిప్యూటీ పీఎం ఎల్.కె. అద్వానీ, హోం మంత్రి అమిత్ షాల గిబ్లి ఇమేజ్ లు కూడా బీజేపి ప్రచారంలోకి తెచ్చింది.
జనసేన నేత పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ఫోటోలేవీ గిబ్లిలో పెట్టనప్పటికీ జనసేన సోషల్ మీడియా మాత్రం తమ అధినేత ఫోటోలను గిబ్లి ఇమేజ్ ల రూపంలో సర్క్యులేట్ చేస్తోంది. 2024 నాటి ఎన్డీఏ ప్రభుత్వ ప్రమాణస్వీకారం టైములో మోడీ, చిరంజీవి, పవన్ కలసినప్పటి అనేక ఇత్రాలను గిబ్లి ఇమేజ్ లుగా రూపొందించి జనసేన సర్క్యులేట్ చేస్తోంది. అలాగే పవన్ పబ్లిక్ ర్యాలీలు, ప్రజలతో సంభాషణలు అన్నీ గిబ్లి ఇమేజెస్ ను సంతరించుకున్నాయి.
తెలంగాణలో గిబ్లి పొలిటికల్ వార్
తెలంగాణ రాజకీయాల్లో కూడా గబ్లి ప్రవేశం జరిగిపోయింది. ముఖ్యంగా నూత సాంకేతిక పరిజ్ఞానాన్ని విచ్చలవిడిగా వాడే బీఆర్ఎస్ జాయిన్ ది ట్రెండ్ పేరుతో గిబ్లి ఇమేజ్ ల సహాయంతో ప్రత్యర్ధి పార్టీల నాయకులను ట్రోల్ చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఒక ఫొటోను గిబ్లిలోకి మార్చి ఇది చాలా మంది ఫేవరెట్ ఫొటో అని ట్రోల్ చేస్తోంది. దీనికి కాంగ్రెస్ నుంచి కూడా కౌంటర్లు గిబ్లితోనే ప్రారంభమయ్యాయి.
గిబ్లి ట్రెండ్ లో మోడీ
ప్రధాని నరేంద్ర మోడీని ఆధునిక గాంధీలా చిత్రీకరిస్తూ రూపొందించిన గిబ్లి చిత్రాలు ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్నాయి. ప్రభుత్వ వెబ్ సైట్ మై గవర్నమెంట్ డాట్ ఇన్ నుంచి పోస్ట్ చేసిన ఈ ఇమేజెస్ కు సోషల్ మీడియా యూజర్లనుంచి భిన్నమైన కామెంట్లు, ఆసక్తికరమైన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.
సామ్ ఆల్ట్ మన్ స్పందన
ఓపెన్ ఏఐ సిఈవో సామ్ ఆల్ట్ మెన్ మోడీ ఇమేజెస్ పై స్పందిస్తూ భారతీయ జెండా ఎమోజీని జోడించి రీపోస్ట్ చేశారు. ఏఐని మన దేశంలో విస్తరించుకోవాలన్న వ్యాపార ప్రయోజనంతోనే సామ్ ఆల్ట్ మన్ మనల్ని కాకా పడుతున్నాడంటూ మరికొందరు సరదాగా కామెంట్ చేశారు. లేటెస్ట్ ఇమేజ్ జనరేటర్ గా మెజారిటీ ప్రజలు చాట్ జీపీటీని వాడుతుండటంతో ఓపెన్ ఏఐ సర్వర్ మీద ఓవర్ లోడ్ పడుతోంది. దాంతో ఆ సర్వీసులు కాస్త మందగమనంతో సాగుతున్నాయి. ఒపెన్ ఏఐ ఇమేజ్ జనరేటింగ్ ఫీచర్స్ అందుబాటులోకి తేవడంతో సోషల్ మీడియా రకరకాల చిత్రాలతో పోటెత్తుతోంది. ఏఐ ఆధారిత ఈ కొత్త ఫీచర్ మొదట్లో పెయిడ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు దానిని అందరికీ ఉచితంగా వాడుకునే వెసులు బాటు కల్పించడంతో కుప్పలు తెప్పలుగా చిత్రాలు రూపొందించి అప్ లోడ్ చేస్తున్నారు. దాంతో ఒక్కోసారి సర్వర్లు హ్యాంగ్ అవుతున్నాయి.
స్టూడియో ఆర్ట్ టెక్నాలజీ
1985లో కనుగొన్న ఈ గిబ్లి స్టూడియో ఆర్ట్ టెక్నాలజీ చేతితో గీసే యానిమేషన్లకు పేరెన్నికగన్నది. అలాగే జన బాహుళ్యానికి బాగా సులభంగా చేరే ప్రచార సాధనం కూడా.ఆధ్యాత్మిక చిత్రాలతో పాటు, పర్యావరణ థీమ్ లతో రూపొందించిన గిబ్లి ఫిల్స్మ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నాయి.
గిబ్లి చిత్రాలు సాంస్కృతిక ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. జపాన్ కల్చర్ అంతా వీటి ద్వారానే ప్రచారమవుతోంది. వాల్ట్ డిస్నీ లాంటి యానిమేటెడ్ కంపెనీస్ అన్నీ చిన్న పిల్లల కార్టూన్లు, మూవీస్ కే ప్రాధాన్యత ఇస్తుండగా, గిబ్లి ట్రెండ్ మాత్రం ఆబాల గోపాలాన్నీ అలరిస్తోంది. పిల్లల నుంచి పెద్ద వారి వరకూ అందరూ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.