23.7 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

వైట్‌ హౌస్ లో సోషల్‌ మీడియాకు పెద్ద పీట

  • మీడియా రూమ్‌ సీట్లలో మార్పులు
  • మొదటి వరుసలో సోషల్‌ మీడియా
  • బ్లాగర్లు, పోడ్‌ కాస్టర్లు, ఇన్‌ఫ్లుయన్సర్లు, కంటెంట్‌ క్రియేటర్లదే హవా
  • సంప్రదాయ మీడియాను కాదని వారికి ప్రాధాన్యత
  • మొదటి ప్రశ్న వేసే అవకాశం వారికే
  • అమెరికాలో తగ్గుతున్న సంప్రదాయ మీడియా హవా
  • సోషల్‌ మీడియాకు పెరుగుతున్న ఆదరణ

డోనాల్డ్ ట్రంప్‌ దృష్టి ఇప్పుడు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాపై పండింది. ఇన్నేళ్ళు వైట్‌హౌస్‌ మీడియా రూమ్‌లో మొదటి బెంచీల్లో కూర్చోపెట్టి సకల మర్యాదులు చేసిన సంప్రదాయ మీడియాను ఇకపై వెనబెంచీలకు నెట్టేశారు ట్రంప్‌. మోడ్రన్ న్యూస్‌  ప్లాట ఫామ్స్‌ను ప్రోత్సహించడం ద్వారా పత్రికలు, టీవీ మాధ్యమాలకి కళ్లెం వేస్తున్నారు డోనాల్డ్‌ ట్రంప్‌

ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రభావం చూశాకో మరి ఎందుకో తెలీదు కానీ సంప్రదాయ మీడియా ప్రభావం నుంచి ట్రంప్‌ బయటపడుతున్నారు. ఎన్నికల్లో ట్రూత్‌ అని స్వయంగా తన సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్ ద్వారా ప్రచారం చేసుకున్న ట్రంప్ గెలిచిన తర్వాత అదే సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లకు పెద్ద పీట వేస్తున్నారు. శ్వేత సౌధంలోని మీడియా రూమ్‌ రూపు రేఖలను సమూలంగా మార్చేస్తున్నారు. గతంలో ఇక్కడ పేరొందిన దేశ, విదేశీ మీడియాకు మొదటి వరస కేటాయించేవారు. ఇప్పుడు వారందరినీ తప్పించి మొదటి వరుసను ఏకంగా సోషల్‌మీడియా జర్నలిస్టులకు కేటాయించారు. ప్రెస్ బ్రీఫింగ్‌ రూమ్‌ లో ఇండిపెండెంట్‌ జర్నలిస్టులు, పోడ్‌ కాస్టర్లు, కంటెంట్‌ క్రియేటర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేటాయించారు.

ప్రజానాడి అప్పుడే పట్టుకున్నారా?

2024 ఎన్నికల ప్రచారంలో కూడా పేరొందిన పోడ్ కాస్టర్లు, సోషల్‌ మీడియా నేతలు థియోవాన్, నెక్ బోయస్, జోరోగన్ లకు ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు. చివరికి గెలిచాక ఇచ్చిన పార్టీలో కూడా పోడ్‌కాస్టర్లకు పెద్ద పీట వేయడమే కాదు… పేరు పేరునా వారిని పలకరించారు.

సంప్రదాయ మీడియా పని అయిపోయిందా?

అమెరికాలో సంప్రదాయ మీడియాకు కాలం చెల్లింది. ఈమధ్య జరిపిన ఓ సర్వేలో ప్రజలెవరూ న్యూస్ పేపర్లు, టీవీలపై ఆధారపడి వార్తలు తెలుసుకోవడం లేదు. అందరూ లేటెస్ట్ టెక్నాలజీ అయిన పోడ్‌కాస్ట్ లు, బ్లాగ్‌లు, సోషల్‌ మీడియా వేదికలనే ఎంచుకుంటున్నారు.పేరొందిన, ప్రజాదరణ కలిగిన ఎన్నో వెబ్‌ సైట్లకు ఇతర మాధ్యమాలకు ఇన్నాళ్లు వైట్‌హౌస్‌లో అసలు ఎంట్రీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అలాంటి ఆధునిక జర్నలిజం పోకడలకే పెద్ద పీట వేస్తోంది ట్రంప్‌ ప్రభుత్వం. మారుతున్న కాలంతో పాటు పద్ధతులు మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈమార్పులు చేసినట్లు వైట్‌ హౌస్ ప్రెస్ సెక్రటరీ జనరల్ కెవిన్ లెవియట్‌ ప్రకటించారు. చెప్పడమే కాదు ప్రెస్ మీట్‌ లో మొదటగా ప్రశ్న వేసే అవకాశాన్ని కూడా ఓ సరికొత్త సోషల్ మీడియా ఎక్సియో సంస్థకు చెందిన మైక్ అలెన్ కు ఇచ్చారు. ఆయన డీప్ సీక్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్ పై ప్రశ్న అడిగారు.

గత ప్రభుత్వం రద్దు చేసిన 440 జర్నలిస్టుల పాస్‌ లను కూడా పునరుద్ధరిస్తామన్నారు. అగ్రరాజ్యం అధినేతగా సంచలనాలకు పేరుపడిన ట్రంప్‌ మొదలు పెట్టిన ఈ ఒరవడిని ఇంకెందరు ఫాలో అవుతారో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com