నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంలో స్లాబ్ కూలి సెంట్రింగ్ కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం రాజేంద్రనగర్ ప్రాంతంలోని బండ్లగూడలో జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో స్లాబ్ కోసం పలువరు కార్మికులు సెంట్రింగ్ కొడుతున్నారు. ఈ సంయంలో ఒక్క సారిగి ఒకవైపు స్లాబ్ మొత్తం దిగువ అంతస్తుపైకి కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు స్లాబ్ కింద ఇరుక్కుపోయారు. స్థానికులు అతి కష్టం మీద కూలిన స్లాబ్ కింద ఇరుకున్న కార్మికులను బటకు తీసి హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఒక్క సారిగా స్లాబ్ మీద పడటంతో కింద ఇరుక్కుపోయిన ఏడు మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణ సంస్ధ ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే స్లాబ్ కూలిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. కార్మికుల ప్రాణాలతో చెలగాటం అడుకుంటోందని స్థానికులు విమర్శిస్తున్నారు. అయితే సంఘటన వివరాలు తెలుసుకున్న బండ్లగుడ జాగీర్ మేయర్ లతాప్రేమ్ గౌడ్ స్లాబ్ కూలిన భవంతిని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న భవన నిర్మాణ కార్మికులను పరామర్శించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.