32.6 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

కొవ్వాడ లో ఆరు అణు రియాక్టర్ల ఏర్పాటు?

  • భారత, అమెరికా దేశాల మధ్య మెగా న్యూక్లియర్ డీల్?
  • మోడీ, ట్రంప్‌ మధ్య కుదిరిన ఏకాభిప్రాయం
  • తొలిదఫా చర్చల్లో ముందడుగు
  • ఏపీలోని కొవ్వాడ లో ఆరు అణు రియాక్టర్లు
  • ఏపీ1000 రకం అణు రియాక్టర్లపై బేర సారాలు
  • మన్మోహన్ హయాంలో కుదిరిన సివిల్‌ న్యూక్లియర్ డీల్‌
  • ఆ తర్వాత లేని పురోగతి
  • ణు విద్యుత్‌ తయారీలో స్వయం సమృద్ధికి మోడీ యత్నం
  • అణు ఇంధనరంగంలో సహకారానికి ట్రంప్ ఓకే
  • 2047 నాటికి భారీగాపెరగనున్న విద్యుత్‌ అవసరాలు
  • అందుకు అణు ఇంధన తయారీయే దిక్కు
  • జీరో కార్బన్ ఎమిషన్ తో ఈ ఇంధనం తయారీ

అణు ఇంధన రంగంలో భారత స్వయం సమృద్ధిని సాధించేందుకు అమెరికా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. మోడీ, ట్రంప్ చర్చల మధ్య కీలకమైన ఈ అంశంపై ప్రాధమిక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయి. తాజా సమాచారం ప్రకారం అమెరికా మనకు ఆరు అణు విద్యుత్ రియాక్టర్ల ఏర్పాటుకు సహకరిస్తుంది. ఇందులో భాగంగా ఏపీలోని కొవ్వాడలో ఆరు అణు రియాక్టర్లు పెడతారు.2008లో భారత ప్రధాని మన్మోహన్‌ హయాంలో రెండుదేశాల మధ్య అణు ఇంధన రంగం ఒడంబడిక జరిగినప్పటికీ అప్పటినుంచి దీనిలో ఎలాంటి పురోగతి లేదు.. ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆ తర్వాత ఎవరూ చేయలేదు.

చర్చలు ఫలిస్తే డీల్‌ ముందుకు…

వెస్టింగ్‌ హౌస్ఎలక్ట్రికల్ కంపెనీ ఏపీ 1000 రకం అణు రియాక్టర్లను భారత్ కు అమ్మేవిషయమై చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ఫలిస్తే భారత్ కు అతిపెద్ద అణు రియాక్టర్ల విడిభాగాలు దక్కే ఆస్కారముంది. వీటి నిర్మాణానికి గ్రీన్ ఫీల్డ్ స్థలాలను కూడా సిద్ధం చేశారు. ఇది ఫలిస్తే భారత్ గడ్డపై సొంతంగా అణు రియాక్టర్ల నిర్మాణం మొదలు పెట్టినట్లే. ఒక్కోటీ వెయ్యి మెగావాట్ల కెపాసిటి కలిగిన ఆరు అణు రియాక్టర్లను ఏపీలోని కొవ్వాడలో నిర్మించే అవకాశాలున్నాయి. ఇవేకాక స్మాల్ అండ్ మీడియం రేంజ్ అణు రియాక్టర్లపై కూడా మోడీ అమెరికా సెక్యూరిటీ అడ్వయిజర్ మైఖేల్‌ వాల్జ్ టూ తో చర్చించారు. ఇవే కాక చిన్న అణు రియాక్టర్లను రూపొందించుకునే విషయంలోనూ,పౌర అణు విద్యుత్‌పై దృష్టి పెట్డడానికి పారిశ్రామిక సహకారాన్ని అందించాలని కూడా మోడీ కోరారు. మోడీ, ట్రంప్‌ మధ్య జరిగిన అనేక రకాల చర్చలు ఫలిస్తే భారత్ అణు ఇంధన తయారీ రంగంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించే వీలుంది. దీని కోసం రెండు దేశాల మధ్య పౌర భద్రతా చట్టానికి,అణు ఇంధన తయారీ చట్టానికి కొన్ని సవరణలుచేయాలి.రెండు దేశాల ప్రయోజనాలను కాపాడే విధంగా ఆ సవరణలు ఎలా జరుగుతాయన్నదే ఇప్పుడు చర్చ.

అసాధారణంగా పెరుగుతున్న డిమాండ్‌

భారత భవిష్యత్ అవసరాలకు 2047 నాటికి కనీసం 100 గిగావాట్ల అణు శక్తి సామర్ధ్యాన్ని సాధించగలిగి ఉండాలి. అణు ఇంధన రంగంలో భాగస్వామ్యం సాధించాలంటే అణు ఇంధన చట్టం,అణు విధ్వంసం నుంచి పౌర బధ్రత చట్టాలకు కొన్ని సవరణలు చేయాలి. ఇదేవిషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మల తన బడ్జెట్‌ లో కూడా వెల్లడించారు. అణు విద్యుత్‌ కేంద్రాలు అణు ఇంధనాన్ని రీ ప్రోసెస్ చేయాలంటే అందుకు యురేనియం పెద్ద మొత్తంలో అవసరమవుతుంది. కానీ మన దగ్గర అన్ని యురేనియం నిల్వలు లేవు. మన విద్యుత్‌ అవసరాల లోడ్‌ ను తట్టుకుని బేస్ లోడ్‌ పవర్ సాధించాలంటే జీరో కార్బన్ ఎమిషన్ తో తయారు చేయగలిగే అణు శక్తి మాత్రమే దిక్కు.అందుకే చాలా దేశాలు కాలుష్యం దుష్‌ప్రభావాలు ఉంటాయని తెలిసి కూడా అణు ఇంధన రంగాన్నే విస్తరించుకుంటున్నారు.

ప్రస్తుతం మనకున్న వనరులతో 8వేల180 మెగావాట్ల అణు ఇంధనాన్ని మాత్రమే తయారుచేసుకోగలుగుతున్నాం. దేశవ్యాప్తంగా మనకు 24 ఆపరేటింగ్‌ అణు రియాక్టర్లుండగా,ఇందులో 20 హై ప్రెషర్ తో నడిచే భారజల అణు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు కాగా మరో నాలుగు లైట్‌ వాటర్ రియాక్టర్లు.. దేశ అవసరాలు అపరిమితంగా పెరుగుతున్నందున తక్కువ కార్బన్ ఎమిషన్ తో అణు ఇంధనం తయారు చేసే వీలున్నందున భారత్ కూడా అణు ఇంధన రంగాన్ని విస్తరించాలని భావిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com