39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

రజతోత్సవం టీఆర్ఎస్‌కా, బీఆర్ఎస్‌కా?

  • సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ

  • రజతోత్సవాలపై సెటైరికల్‌ డిస్కషన్స్‌

కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ రాజతోత్సవాలపై సోషల్‌ మీడియాలో సెటైర్‌ బాంబులు పేలుతున్నాయి. వరంగల్‌లో రజతోత్సవం నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. పార్టీ అధినేతలు, అగ్రనేతలు అయితే హడావిడి చేస్తున్నప్పటికీ.. సభ ఏర్పాట్లపై అటు.. నాయకుల్లో గానీ, ఇటు.. కార్యకర్తల్లో గానీ పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదంటున్నారు. కనీసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న స్థానిక నాయక గణం, కార్యకర్తలు కూడా అవసరమైనంతగా రెస్పాండ్‌ కావడం లేదన్న వార్తలు కొద్దిరోజులుగా షికార్లు చేస్తున్నాయి.

ఇక, అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఈ పరిస్థితులు ఆయుధాలను చేతికి అందించినట్లు అవుతోంది. అందుకే సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో బీఆర్‌ఎస్‌ రజతోత్సవంపై సెటైరికల్‌ వార్‌ నడుస్తోంది. అసలు రజతోత్సవం జరుగుతున్నది బీఆర్‌ఎస్‌ పార్టీకా? టీఆర్‌ఎస్‌ పార్టీకా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసలు పార్టీ పెట్టిన సమయంలో కేసీఆర్‌ వెంట ఉన్న వాళ్లెవరూ.. ఇప్పుడు కేసీఆర్ వెంట లేరు కదా.. అన్న లాజికల్‌ క్వశ్చన్స్‌ వేస్తున్నారు. పార్టీ పెట్టాక, రాష్ట్రం సిద్ధిచిన తర్వాత మధ్యలో వచ్చినవాళ్లు, అవకాశవాదులతో ఉన్న ఆ పార్టీకి అసలు రజతోత్సవాలు ఎందుకంటూ వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక, పార్టీ పేరు విషయంలోనూ సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో పార్టీ పెట్టి, భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి రజతోత్సవాలు ఎలా చేస్తారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ పార్టీకి రజతోత్సవాలు చేస్తున్నారో ప్రజలకు.. అంతెందుకు పార్టీ కార్యకర్తలకే క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి రెండేళ్ల క్రితమే కేసీఆర్‌ బొంద పెట్టాడు కదా.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఉత్సవాలంటే.. ఆ పార్టీ వచ్చి రెండేళ్లే అయ్యింది కదా.. అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ పార్టీ అనేది తెలంగాణ గొంతుక కాదని, రాష్ట్రం గొంతు కోసిన పార్టీ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా టీమ్‌.

అసలు తెలంగాణ ఉద్యమం సమయంలో కేటీఆర్, కవిత అమెరికాలో ఉన్నారని.. వాళ్లకు ఉద్యమం అంటేనే తెలియదని, రాష్ట్ర సెంటిమెంట్‌, భావోద్వేగాలపై కూడా వాళ్లకు అవగాహన లేదని ఆరోపణలు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు మినహా ఎవరు మిగిలారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో చూస్తే.. ఇప్పుడు తుపాకీ రాముడు, రబ్బర్ చెప్పుల హరీష్, లిక్కర్ కవిత, హ్యాపీ రావు తప్ప ఎవరున్నారని ఒక రకంగా ఎటాక్‌ చేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com