30.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

జలపాతాన్ని వేడెక్కించిన మంజరీ ఫడ్నీస్

సిద్దూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంజరీ ఫడ్నీస్… అంతకుముందు హిందీ సినిమాల్లో బిజీగా ఉంది.  ఈ బ్యూటీ తెలుగులో ఇంకోసారి, శుభప్రదం, శక్తి తదితన సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మంజరీ రెడ్ డ్రెస్లో జలపాతం వద్ద హొయలు పోయింది. తన సోయగాలతో జలపాతాన్నే వేడిక్కించింది.

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలి ప్రేక్షకులను మెప్పించినా… ఆ సినిమాలేవీ ఆమెకు అంతగా పేరు తెచ్చి పెట్టలేదు. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం మాత్రమే కాస్త ఇమేజీ తెచ్చి పెట్టంది.

టాలీవుడ్‌లో తనకు అంతగా కలిసిరావడం లేదని గ్రహించిన మంజరీ ఫడ్నీస్ ఇప్పుడు హిందీ సినిమాలకే పరిమితం అయ్యింది.

ముంబైలో మహారాష్ట్ర కుటుంబానికి చెందిన రుచి ఫడ్నిస్… మంజరీ 1984 జూలై 10న జన్మించింది. ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేశారు. దాంతో దేశంలోని అన్ని నగరాల లైఫ్ స్టైల్ చూసింది.

2008 హిందీ చిత్రం జానే తు… యా జానే నా సినిమాలో నటనతో ప్రసిద్ధి చెందింది. హిందీలో మంజరీ నటించిన ఫల్తు (2006), జొక్కోమాన్ (2011), వార్నింగ్ (2013), గ్రాండ్ మస్తీ (2013), కిస్ కిస్కో ప్యార్ కరూన్ (2015), షార్ట్ ఫిల్మ్ ఖమాఖా (2016), బారోట్ హౌస్ (2019) మొదలైనవి ఉన్నాయి.

హిందీలో పలు వెబ్ సీరీస్ లో నటించిన మంజరీ ఫడ్నీస్… ఫ్రీలాన్సర్ వెబ్ సిరీస్ లో నటించి పేరు తెచ్చుకుంది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో ఇలియానా కథానాయికగా నటించగా.. మంజరీ కీలకపాత్ర పోషించింది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

2022 తర్వాత హిందీ ఇతర భాషల్లో సినిమాలు తగ్గాయి. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న మంజరీ… సోషల్ మీడియాలో నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను కవ్విస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com