26.7 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీయస్‌కు అభ్యంతరాలు తెలపండి

  • తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించిన సీయం రేవంత్‌రెడ్డి
  • పోలవరం ప్రభావంపై ఐఐటీ బృదంతో అధ్యయనానికి ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ధితిగతలు మారిపోతాయని చెపుతూ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తలపెట్టిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు తెలుపుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయమని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సీయం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్‌దాస్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల స్ధితిగతులపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారాన్ని సీయం రేవంత్‌రెడ్డి దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు. ఈ ప్రాజె క్ట్ పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని సీయంకు వివరించారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు తెలియ‌జేశారు. దీనిపై స్పందిచిన సీయం వెంటనే ఏపీ సీయస్ కు అభ్యంతరాలు తెలమని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డుతో పాటు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు కూడా లేఖలు రాయాలని సీయం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రంపై పడే ప్రభావంపై హైదరాబాద్‌ ఐఐటీ బృందంతో నివేదిక తయారు చేయించమని నీటిపారుదల శాఖ అధికారులను సీయం ఆదేశించారు. ఐఐటీ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించమని సీయం సూచించారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్ప‌డే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారుకు చెప్పారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేసి తెప్పించమని అధికారులకు రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో అన్నారు. 2022 లో 27 లక్షల క్యూసెక్ ల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎం రేవంత్‌రెడ్డికి సమావేశంలో అధికారులు వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com