కుంభమేళాకు వెళ్లి వస్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన వాహనంలో హైదరాబాద్ కు చెందిన యాత్రికులు ఉన్నారని ప్రాథమిక సమాచారం.
హైదరాబాద్ నాచారానికి చెందిన భక్తులు కొద్దిరోజుల క్రితం కుంభమేళాకు పయనమయ్యారు. ఆ మినీ బస్సులో 14 మంది ప్రయాణిస్తున్నారు. కుంభమేళ ప్రయాగరాజ్(అలహాబాద్) నుండి తిరుగు ప్రయాణంలో మధ్యప్రదేశ్ జబల్పూర్ శిరోహి ప్రాంతంలో మంగళవారం ఉదయం 9 గంటల పది నిమిషాలకు ప్రమాదం చోటు చేసుకుంది.
వంతెనపై లారీని తప్పించబోయిన యాత్రికుల టెంపో ట్రావెలర్ అదుపు తప్పిందని స్థానికులు చెపుతుండగా… లారీ అదుపు తప్పటం వల్లే టెంపో ట్రావెలర్ ప్రమాదానికి గురైందనే వాదన ఉంది.
టెంపో ట్రావెలర్ లో ఏడుగురు మృతి చెందారని సమాచారం. మరో ఆరుగురికి గాయాలైనట్టు తెలుస్తున్నాయి. స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ట్రీట్మెంట్ జరుగుతోందని… వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.