33.7 C
Hyderabad
Sunday, May 3, 2026

Live Video

spot_img

సంధ్యా థియేటర్ లో సీన్ రీకనస్ట్రక్షన్

కాసేపట్లో థియేటర్ దగ్గరకి అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో విచారణనెదుర్కొంటున్న సినీ హీరో అల్లు అర్జున్ ను మరికాసేపట్లో సంధ్యా ధియేటర్ దగ్గరకు సీన్ రీ కనస్ట్రక్షన్ కోసం తీసుకెళతారని తెలుస్తోంది. ప్రస్తుతం సంధ్యా థియేటర్ లో మార్నింగ్ షో నడుస్తోంది. కాబట్టి షో అయిపోయాక అర్జున్ను అక్కడకు తీసుకెళతారని అంటున్నారు. అసలు ఆరోజు ఏం జరిగింది? బన్నీ ఫ్యామిలీ థియేటర్ కు ఎన్నికార్లలో వచ్చారు? బౌన్సర్ల తీరు ఎలా ఉంది? ఎన్ని గంటలకి బన్నీ హాలులోకి వెళ్లాడు. ఎక్కడ కూర్చున్నాడు. తొక్కిసలాటకు గురైన లొయర్ బాల్కనీ దగ్గర మహిళ మ్రుతి ఘటన ఎలా జరిగింది? లాంటి వన్నీ ప్రత్యక్షంగా అర్జున్ ను స్పాట్ లోకి తీసుకెళ్లి విచారిస్తున్నారు.

ఆరోజు థియేటర్ లో రెండుగంటల పాటు సినిమా చూసిన అర్జున్ తాను కాసేపే ఉన్నానని, మహిళ మ్రుతి విషయం తనకసలు తెలియదని అన్నారు.తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్టయ్యాడు. అయితే పోలీసులు దీనిపై మరింత లోతుగా విచారించే క్రమంలో ఇవాళ చిక్కడపల్లి పీఎస్ కి అర్జున్ హాజరయ్యాడు. దాదాపు 20 ప్రశ్నలను అల్లు అర్జున్ కి పోలీసులు సంధిస్తున్నారు. అయితే వెంట అడ్వకేట్ అశోక్ రెడ్డి ఉండేందుకు అనుమతించారు. ఆరోజు థియేటర్ లో పోలీసులు ఎన్ని గంటలకు బన్నీని హెచ్చరించారు. ఎన్ని గంటలకి బన్నీ బయటకు వచ్చాడు? వచ్చే టప్పుడు మళ్లీ చేతులు ఊపి వెళ్లడం పైనా పోలీసులు సీన్ టు సీన్ రికనస్ట్రక్షన్ చేయబోతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com