సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు అస్సలు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు ఇది. చేసినవి మూడే సినిమాలు అయినా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయనంటే అందరికి తెలుసు. అర్జున్ రెడ్డీతో తానేంటో ప్రూవ్ చేసుకున్న సందీప్.. యానిమల్‌తో ఆయన హోదాను మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్‌ను తీసేందుకు రెడీ అవుతున్నారు. అయితే తన మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్ కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాల్సిందే అని తేల్చి చెబుతున్నారట సందీప్ రెడ్డి.
ఒక్కసారి స్పిరిట్ లోకేషన్‌లోకి ఎంట్రీ ఇస్తే.. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యే వరకు మరే సినిమా చేయకూడదు. వారానికి ఒకరోజు, రెండురోజులు కాల్షీట్లు అంటే కదురదు.. బల్క్‌గా ఇవ్వాలి. మూవీలో తన లుక్‌ను బయట రివీల్ చేయకూడదు.. సినిమాలో డూప్ అనే కాన్సెప్ట్ ఉండదు.. ఇలా కొన్ని కండిషన్స్‌ను ప్రభాస్‌కు ముందే చెప్పారట సందీప్ రెడ్డి వంగ. మరి దీనికి డార్లింగ్ రియాక్షన్ ఎలా ఉందో తెలియాల్సి ఉంది.
మాములుగా అయితే సందీప్ ఏ విషయంలో కాంప్రమైజ్ అయ్యే రకం అస్సలు కాదు. ఇక ప్రభాస్ ఎవరికి నో చెప్పే రకం అసలే కాదు. ఎందుకంటే తాను సినిమాకు ఒక్కసారి ఓకే చెబితే దాని కోసం ఎంతకాలమైన వేచి చూస్తాడు. దీనికి బాహుబలినే ఓ పెద్ద ఉదాహరణ. సో.. సందీప్‌కు పెద్దగా ఇబ్బంది ఉండదనే అనుకోవాలి.
స్పిరిట్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు ప్రభాస్. ఈ మూవీ వచ్చే ఏడాది చివర్లో కానీ.. 2027 మొదట్లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే దీని కంటే ముందు ప్రభాస్ నటించిన రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.