31.2 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

రాజమౌళి, మహేష్‌ మూవీ స్టోరీపై కొత్త ప్రచారం..

ప్రస్తుతం ఫిలీంనగర్ సర్కిల్స్‌లో కొత్త ప్రచారం మొదలైంది. మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న జంగిల్ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటరైనర్.. కాశీ బ్రాక్‌డ్రాప్‌తో నడిచే కథ అని ప్రచారం మొదలైంది. అంతేకాదు హనుమంతుడి స్ఫూర్తితో హీరో పాత్రను డిజైన్ చేశారని.. అందుకే హైదరాబాద్‌లో కాశీ సెట్ వేశారన్న ప్రచారం జరుగుతోంది.

ఒక విషయమైతే పక్కా.. అదేంటంటే ఇది మైథాలజీ, హిస్టరీలతో కూడి జంగిల్ అడ్వెంచరస్ మూవీ. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతం షూటింగ్‌ కూడా వేగంగా జరుగుతోంది. సైలెంట్‌గా సాగుతున్న ఈ మూవీ షూటింగ్ వీడియో కూడా ఒకటి లీక్ అయ్యింది. అందులో ఇంటర్నెషనల్ ఆర్టిస్టులు కనిపిస్తున్నారు.

ఈ మూవీపై మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ట్రెజర్ హంట్ మూవీ అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడేమో కాశీ నేపథ్యంలో సాగే కథ అంటున్నారు. మొత్తానికి జక్కన్న మూవీపై ఉన్న క్యూరియాసిటీ ఆయనకు పెద్ద కష్టం లేకుండానే పబ్లిసిటీ చేసి పెడుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com