34.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

సఫారీలు సాధించేశారు

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ షిప్‌ ఫైనల్ బెర్త్‌ను సౌతాఫ్రికా కన్ఫామ్ చేసుకుంది.పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీలు తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. సఫారీలు వచ్చే జూన్‌లో లార్డ్స్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దీంతో ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడే మరో జట్టు ఏది అనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ మాత్రమే మరో బెర్తును ఖరారు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. దీంతో ఈ రెండు జట్లలో..ఏ టీం టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌‌కు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1తో కైవసం చేసుకుంటే ఫైనల్‌కు వెళుతుంది. కానీ అలా జరగాలన్నా శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలవాలి. ఒకవేళ బీజీటీ సిరీస్‌ 2-2తో డ్రా అయినా భారత్‌కు అవకాశం ఉంటుంది. అప్పుడు శ్రీలంకతో సిరీస్‌లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించకూడదు. అప్పుడు భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అడుగుపెట్టే అర్హత పొందుతుంది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ 1-1తో ముగిసినా భారత్‌కు ఛాన్స్‌ ఉంది. అలా జరగాలంటే ఆసీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక 1-0తో గెలవాలి. ఈ సమీకరణాలతో సంబంధం లేకుండా టీమ్‌ఇండియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆసీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టుతోపాటు, సిడ్నీలో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిస్తే..ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తలుపులు ఈజీగా తెరుచుకుంటాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com