క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సారా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది
సారా టెండుల్కర్ 1997లో ముంబైలో జన్మించింది
ప్రాథమిక విద్య ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పూర్తి చేసిన సారా ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది
సారా తన వ్యక్తిగత విశేషాలతో పాటు ఆహారపు అలవాట్లు, ఇష్టాలను కూడా తరచూ అభిమానులతో పంచుకుంటుంది.
వృత్తిరీత్యా న్యూట్రిషనిస్ట్ అయినప్పటికీ, సారా టెండూల్కర్ తన ఆహారపు ఇష్టాల విషయంలో ఏమాత్రం రాజీపడదు.
సారా టెండూల్కర్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌కి కొత్త డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది.
పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో స్థాపించిన సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సారాకు డైరెక్టర్ పదవి ప్రకటించారు
సెలెబ్రిటీ కుమార్తె కావడంతో సారాపై కూడా పుకార్లు షికారు చేశాయి
క్రికెటర్ శుభ్ మాన్ గిల్, కుష్ ప్రీత్ సింగ్ లతో సారా షికార్లు చేస్తోందని వార్తలు వచ్చాయి
సారా ఇటీవల ఓ ప్రకటన చేస్తూ ప్రస్తుతం సేవా కార్యక్రమాల్లో ఉన్నానని తప్పుడు వార్తలతో ఇబ్బంది పెట్టొద్దని కోరింది