22.7 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

అమెరికా నుంచి డబ్బు పంపాలంటే జేబు గుల్లే

  • భారతీయులపై డోనాల్డ్ ట్రంప్ మరో పిడుగు పాటు

  • అంతర్జాతీయ నగదు బదిలీపై 5% టాక్స్ కట్ పాలసీ

  • ప్రతీ లక్ష రూపాయలకు 5 వేల రూపాయలు రెమిటెన్స్ ఫీజు

  • బ్యాంకు ఎక్కంటౌ నుంచైనా, మరే విధంగానైనా

  • బిల్లు ఆమోదం పొందితే జులై4 నుంచి అమల్లోకి

  • ఛైల్డ్ క్రెడిట్ పాలసీ మూడేళ్లు పొడిగింపు

  • భారతీయుల రెమిటెన్స్ భారం ఏటా 83 బిలియన్ డాలర్లు

  • ప్రతిపాదిత పాలసీపై వణుకుతున్న ఇమ్మిగ్రంట్లు..

అమెరికాలో ఉంటున్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ నెత్తిన ట్రంప్ ప్రభుత్వం టాక్స్ రూపంలో మరో పిడుగు పడేయనుంది. అదే 5 శాతం పన్ను.. అమెరికాలో ఉంటున్న విదేశీయులు అంతర్జాతీయ నగదు బదిలీ చేస్తే 5శాతం పన్ను కట్టాలన్నది ఆ కొత్త ప్రతిపాదన. ఈ బిల్లును ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ కాంగ్రెస్ ముందుంచింది.అమెరికాలో ఉంటున్న లక్షల మంది ఎన్నారైలు తమ సొంత కుటుంబాలకు డబ్బు పంపుతుండటం ఆనవాయితి. ఆ మాట కొస్తే డబ్బు సంపాదించి పంపేందుకే భారతీయులు ఎక్కువ మంది అమెరికా వెళుతుంటారు.ట్రంప్ తాజా ప్రతిపాదన రివర్స్ యూఎస్ టాక్స్ పాలసీ భారతీయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.2017 నాటి టాక్స్ కట్స్ జాబ్స్ యాక్ట్ ను శాశ్వతం చేసేందుకు ఉద్దేశించినదే ఈ కొత్తబిల్లు. అలాగే ఆదాయపన్ను ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్)2,500 డాలర్లకు ఛైల్డ్ టాక్స్ క్రెడిట్ ను 2028 వరకూ పొడిగించాలని ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ బిల్లు చాలా అద్భుతమైనదని దీనిని త్వరగా పాస్ చేయాలని సభ్యులను కోరారు.

ఈసారి రెమిటెన్స్ టాక్స్ ను కూడా ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సరిహద్దుల రక్షణ కోసం నిర్మించే ప్రాజెక్టులకు వినియోగిస్తారు. అయితే ఈ ఆదాయం పూర్తిగా ఇమ్మిగ్రెంట్ల నుంచి వచ్చేదే. ఇప్పటి వరకూ ఇలాంటి టాక్సులు లేవు. మనదేశం ప్రతీ ఏటా 83 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ భారం భరిస్తోంది. ట్రంప్ పెట్టిన కొత్త రూల్ ప్రకారం భారత్ కు పంపే ప్రతీ లక్ష రూపాయలకు 5వేలు రెమిటెన్స్ ఛార్జీలు పడతాయి. ఆర్థిక అవసరాలు, అప్పులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లు ఇలా రకరకాల రోజువారీ ఖర్చులే తడిసి మోపెడవుతున్నసందర్భంలో ఈ అదనపు టాక్స్ భారతీయులకు మరింత భారంగానే పరిణమించనుంది. ఈ కొత్త బిల్లును మే 26న మొమెరియల్ డే నాడు సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. సెనేట్ ఈ బిల్లును ఆమోదిస్తే జులై 4నుంచి అమల్లోకి వస్తుంది. బ్యాంకులు, నగదు బదిలీ కేంద్రాలు ఈ రెమిటెన్స్ టాక్స్ ను కట్ చేసి బదిలీ చేస్తాయి. ఇది ఖచ్చితంగా ఎన్నారైలను ఇబ్బంది పెట్టేదే. సంప్రదాయ బ్యాంకును వినియోగించినా,ఎన్నార్వో ఎక్కౌంట్ ను వినియోగించినా 5 శాతం ఫీజు మాత్రం కట్ అవుతుంది. కాబట్టి ఇప్పటినుంచి కుటుంబానికి డబ్బు పంపడమంటే అదనపు భారమే…

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com