34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఈయూకు నిలిచిన రష్యా గ్యాస్.. ఎవరికి ఈ లభ్ది..?

యూరోపియన్‌ యూనియన్‌కు 40 ఏళ్లుగా రష్యా నుంచి సరఫరా అవుతున్న గ్యాస్‌ నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు ఇటు ఈయూకు.. అటు రష్యాకు మాత్రమే కాదు.. ఉక్రెయిన్‌కు ఇబ్బందులు తప్పని పరిస్థితి. అయితే ఈ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అసలేంటి ఒప్పందం?
యూరోపియన్ దేశాలు రష్యా గ్యాస్‌పై ఆధారపడి ఉన్నాయి. రష్యాను శత్రు దేశంగా భావిస్తూ ఎన్నో ఆంక్షలు విధించి ఇబ్బందులు పెట్టినా ఈ గ్యాస్ సరఫరా మాత్రం ఆగలేదు. ఎందుకంటే ఈయూ దేశాలు చలిని తట్టుకోవాలంటే రష్యా గ్యాస్ అవసరం. అందుకు రష్యా తన ప్రతాపాన్ని ఉక్రెయిన్‌పై చూపించినా ఈ గ్యాస్‌ సరఫరాను మాత్రం ఆపలేదు. అయితే ఉక్రెయిన్‌లోని నఫ్టోగాజ్‌, రష్యాలోని గాజ్‌ప్రోమ్‌ మధ్య ఒప్పందం 2020లో ఒప్పందం కుదిరింది. గ్యాస్‌ ఉక్రెయిన్‌ మీదుగా పైప్‌లైన్ల ద్వారా వెళుతుంది. మొదట్లో ఉక్రెయిన్‌ మీదుగా రష్యన్‌ గ్యాస్‌ ఏడాదికి 65 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు సరఫరా అయ్యేది. కానీ ఉక్రెయిన్ – రష్యా యుద్ధం మొదలైన తర్వాత పరిస్థితులు మారాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఆ తర్వాత సరఫరా భారీగా పడిపోయింది. ఏడాదికి 65 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉండే సరఫరా.. 14 బిలియన్‌ క్యూబిక్‌ మీట సంవత్సరానికి 14 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు తగ్గిపోయింది. అమెరికా ఒత్తిడి, ఉక్రెయిన్‌కు మద్ధతుగా నిలిచేందుకు ఈయూ దేశాలు రష్యా గ్యాస్‌ను తగ్గించేసుకున్నాయి.

లాభపడ్డ దేశాలు ఇవే..
ఉక్రెయిన్ యుద్ధం పేరుతో లాభపడ్డ దేశం అమెరికా అనే చెప్పాలి. ఓ వైపు ఆయుధాలను అమ్ముకోవడమే కాదు.. రష్యా గ్యాస్‌ సప్లైని రీప్లేస్‌ చేసిన దేశాల్లో అమెరికాదే పెద్ద హస్తం అని చెప్పుకోవాలి. రష్యా మార్కెట్‌ను నార్వే, అమెరికా, ఖతార్‌ ఆక్రమించేశాయి. రష్యా నుంచి చౌకగా కొనే గ్యాస్‌ను ఇప్పుడు అధిక ధర చెల్లించి కొంటున్నాయి ఈయూ దేశాలు.

అందరికి నష్టమే..
నిజానికి ఉక్రెయిన్‌ గుండా ఈయూకు గ్యాస్‌ సరఫరా కొనసాగితే రష్యాకు 5 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చి ఉండేది. ఇది రష్యాకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక కేవలం తమ భూములపై నుంచి పైప్‌లైన్స్ వేళుతున్నందుకు 800 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్‌ డాలర్లు ఫీజు రూపంలో మాత్రమే అందేది. ఉక్రెయిన్‌కు ఇది కూడా నష్టమే. ఇక ఈయూ దేశాలు అధిక ధర చెల్లించి గ్యాస్‌ కొంటున్నాయి. ఇది వారికి కూడా నష్టమే.

ఇప్పుడీ గ్యాస్‌ సప్లై నిలిచిపోవడంతో ఎక్కువగా ఇబ్బందులు పడేది ఆస్ట్రియా, స్లోవేకియా అని తెలుస్తోంది. కానీ చెక్‌ రిపబ్లిక్‌, హంగరీ, పోలండ్‌ వంటి దేశాల నుంచి గ్యాస్‌ తీసుకుంటామని చెబుతున్నాయి ఈ దేశాలు.

రష్యాను దెబ్బతీశాం: జెలెన్‌స్కీ
గ్యాస్‌ సరఫరా నిలిచిపోగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కీలక ప్రకటన చేశారు. ఒప్పందాన్ని తామే నిలిపివేశామని.. ఇది ఓ చారిత్రక నిర్ణయమన్నారు. తాము రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశామని ప్రకటించారు. కానీ ఈ ప్రకటనపై రష్యా భిన్నంగా స్పందించింది. ఈ ఒప్పందం నిలిపివేతతో ఉక్రెయిన్‌కే నష్టమని తెలిపింది.

ఎక్కువ నష్టం ఉక్రెయిన్‌కేనా?
నిజానికి ఇక్కడ పూర్తిగా నష్టపోయేది ఉక్రెయిన్‌ అనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇదే గ్యాస్‌ను రష్యా బహిరంగ మార్కెట్‌లో అదే ధరకు విక్రయిస్తే కొనుగోలు చేసే దేశాలు చాలానే ఉన్నాయి. ఇక ఈయూ దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి. ఎటోచ్చి పైసా లాభం రానిది ఉక్రెయిన్‌కు మాత్రమే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com