39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

రుషికొండ బీచ్‌కు ‘బ్లూఫ్లాగ్’ ధ్రువీకరణ పునరుద్ధరణ

  • బ్లూ ఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్న మంత్రి దుర్గేష్

  • ‘బ్లూఫ్లాగ్’ పునరుద్ధరణపై మాట ఇచ్చి నిలబెట్టుకున్నామన్న మంత్రి దుర్గేష్

  • అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్

  • ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి

  • రాష్ట్రంలో మరికొన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు

విశాఖలోని రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఒక ప్రకటనలో మంత్రి దుర్గేష్‌ పేర్కొన్నారు. బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం పర్యాటక శాఖ అధికారుల కృషిని, విశాఖ కలెక్టర్ హరేంద్రీ ప్రసాద్ చొరవను, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పోలీస్, అటవీ శాఖల అధికారులను మంత్రి దుర్గేష్ అభినందించారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు ప్రోత్సహించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భారతదేశంలో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన మొదటి ఎనిమిది బీచ్‌లలో రుషికొండ ఒకటని తెలిపిన మంత్రి దుర్గేష్ నిరంతరం రుషికొండ బీచ్ లో భద్రతా ప్రణాళిక, పర్యావరణం, ట్రాఫిక్, నీటిశుద్ధి, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసామన్నారు. రాష్ట్రంలో మరిన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. మరి కొన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తే ఆయా బీచ్‌లకు ప్రత్యేక నిధులు వచ్చి మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

ఇప్పటికే రుషికొండ బీచ్‌పై విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలు ఎత్తివేస్తున్నట్లు బ్లూఫాగ్ ఇండియా అధికారులు ప్రకటించి విశాఖపట్నం కలెక్టర్‌కు సబంధిత ధ్రువీకరణ పత్రం అందజేశారు. మళ్లీ రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్ హోదాను డెన్మార్కుకు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రకటించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన రుషికొండ బీచ్‌లో మళ్లీ నీలి రంగు జెండా రెపరెపలాడుతోంది. యుద్ధప్రాతిపదిక పర్యాటక శాఖాధికారులకు దిశానిర్దేశం చేస్తూ అనతి కాలంలోనే బ్లూఫ్లాగ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్న మంత్రి దుర్గేష్ ను రాష్ట్ర ప్రజలు, పర్యాటకులు, ప్రత్యేకించి విశాఖ వాసులు అభినందిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com