ముంబయ్ నగరంలో ఒక ఆర్టీసీ బస్సు పాదచారుల మీదకు దూసుకు వెళ్ళడంతో నలుగురు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనలో శివమ్ కశ్యప్, అఫీల్ ఫా, అనమ్ షేక్, కనీజ్ ఫాతిమా అనే వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వీరుకాకుండా మరో 29 మంది గాయాల పాలయ్యారు. పలు ఆటోలు, ద్విచక్రవాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. సోమరవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కుర్లాలోని బార్వే రోడ్ లో ముంబయ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కి చెందిన రూట్ నంబర్ 332 బస్సు ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యింది. బస్సు డ్రైవర్ సంజయ్ ని అరెస్ట్ చేశారు.